ఆల్‌టైం గరిష్టాన్ని తాకిన ఎన్‌ఎస్ఈ నిఫ్టీ
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సోమవారం ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. బ్యాంకులు, నిఫ్టీలోని కొన్ని పెద్ద సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు లాభాలు గడించడంతో పాటు ఆసియా మార్కెట్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు సానుకూల
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సోమవారం ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. బ్యాంకులు, నిఫ్టీలోని కొన్ని పెద్ద సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు లాభాలు గడించడంతో పాటు ఆసియా మార్కెట్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు సానుకూలంగా సాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 151.15(0.47%) లాభపడి 32,423.76 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 67.70 పాయింట్లు పుంజుకొని 10,153.10 వద్ద స్థిరపడింది.

చమురు,సహజ వాయు రంగం తప్ప బీఎస్ఈలో అన్ని రంగాలు లాభాల్లో కొననసాగాయి. మొత్తం రంగాల్లో క్యాపిటల్ గూడ్స్(1.55%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.48%), ఆటో(1.29%), స్థిరాస్తి(0.8%) లాభపడగా, చమురు, సహజ వాయు రంగం(0.11%) మాత్రం నష్టపోయింది
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో బజాజ్ ఆటో(3.27%), హెచ్‌యూఎల్(2.73%), ఎల్ అండ్ టీ(2.14%), కోల్ ఇండియా(1.75%), సిప్లా(1.69%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో ఓఎన్‌జీసీ(1.11%), ఐటీసీ(0.78%), టాటా స్టీల్(0.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.57%), సన్ ఫార్మా(0.38%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications