భారత విదేశీ మారక నిల్వల సరికొత్త రికార్డు
సెప్టెంబరు 8తో ముగిసిన వారానికి మన విదేశీ మారక నిల్వలు తొలిసారి 400 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరు 8 నాటికి మొత్తం విదేశీ మారక ని
సెప్టెంబరు 8తో ముగిసిన వారానికి మన విదేశీ మారక నిల్వలు తొలిసారి 400 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరు 8 నాటికి మొత్తం విదేశీ మారక నిల్వలు 400.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2014లో 300 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఈ స్థాయి కేవలం మూడున్నర ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు ఏడాది పాటు చేసుకునే దిగుమతుల చెల్లింపులకు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విదేశీ మారక నిల్వలు 6.6 బిలియన్ డాలర్ల మేర పెరగిఆయి. సెప్టెంబరు 2016లో ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టినప్పుడు నిల్వలు 30 బిలియన్ డాలర్ల మేర పుంజుకున్నాయి.
ఆర్బీఐ సమాచారం మేరకు విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారం, ఐఎంఎఫ్ వద్ద డ్రాయింగ్ రైట్స్ అన్ని కలిపి 400.7 బలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువ శాతం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా వచ్చిన నిల్వలే. ఏప్రిల్-సెప్టెంబరు మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే అంతకు ముందు ఏడాది ఆయా నెలల మధ్య కేవలం 3.9 బిలియన్ డాలర్లే. ఇంకా విదేశీ సంస్థాగత పెట్టుబడులు మొదటి త్రైమాసికంలో 11.9 బిలియన్ డాలర్ల మేర వృద్ది చెందాయి. అదే గతేడాది మొదటి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు కేవలం 1.2 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications