ఒకసారి వీటిలో దిగితే జీవితాంతం మరిచిపోలేని అనుభూతినిస్తాయి. అందుకోసమే అవి దేశంలోని ఖరీదైన హోటళ్లుగా ప్రసిద్ది చెందాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశం పురాతన చరిత్ర,సంస్కృతికి పెట్టింది పేరు. అలాంటి రాచఠీవిని ఉట్టిపడేలా పలు నగరాల్లో చాలా సంస్థలు మంచి హోటళ్లను నిర్మించాయి. ప్రతి ప్రయాణికుడి అవసరాలు తీరేలా ఈ హోటళ్ల నిర్మాణ శైలి, విలాసం వంటి వాటిని వారసత్వాన్ని కొనసాగించేలా ఇందులో సౌకర్యాలు ఉంటాయి. ఒకసారి వీటిలో దిగితే జీవితాంతం మరిచిపోలేని అనుభూతినిస్తాయి. అందుకోసమే అవి దేశంలోని ఖరీదైన హోటళ్లుగా ప్రసిద్ది చెందాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. రాంబాగ్ ప్యాలెస్, జైపూర్
ఆనాటి రాజుల రాచరిక వైభవం ఉట్టిపడే నగరం జైపూర్. అక్కడ ఖరీదైన హోటల్ వసతులకు కొదవ లేదు. అలాంటి వాటిలో ఒకటైన రాంబాగ్ ప్యాలెస్‌లో సుఖ్ నివాస్, సూర్యవంశి సూట్లలో ఒక రోజు బస కోసం రూ.7,50,000 ఖర్చు అవుతుంది.

2. తాజ్ లేక్ ప్యాలెస్
మేవాడ్ రాజ్య వంశస్తులు నివసించిన ఇల్లు ఇది. పిచోలా లేక్ మధ్యలో ఉండే ఇందులోని ప్రెసిడెన్సియల్ సూట్లో ఒక రోజు ఉండేందుకు రూ.6లక్షలు చెల్లించాల్సి ఉంటుందట.

3. లీలా ప్యాలెస్, న్యూఢిల్లీ
దేశ రాజధానిలో అత్యంత ఖరీదైన హోటళ్లలో లీలా ప్యాలెస్ ఒకటి. ల్యుటెన్ వాస్తుకళతో, భారతీయ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. ఇందులో మహారాజా సూట్ తీసుకుంటే ఒక రోజుకు రూ.4,50,000 ఖర్చవుతుంది.

4. ది ఒబెరాయ్, గుర్గావ్
తరుచూ ప్రయాణాలు చేసేవారికి ఒబెరాయ్ హోటళ్ల గురించి తప్పక తెలిసి ఉంటుంది. అలా ఇంకా విలాసవంతమైన ప్రదేశాల్లో ఉండే వాళ్లకు సుపరిచితమైన వాటిలో గుర్గావ్‌లోని ఒబెరాయ్ హోటల్ ఉంటుంది.
ఇక్కడ ఒక రోజు ఉండటానికి ప్రెసిడెన్షియల్ సూట్‌లో అయ్యే ఖర్చు రూ.3,00,000

5. ది ఒబెరాయ్, ముంబయి
ముంబయిలో బాగా ఆసక్తిని కలిగించే అందమైన హోటళ్లలో ది ఒబెరాయ్ సముద్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ ఉండే గదుల్లో ఖరీదైన సూట్ దాదాపు రూ.3,00,000 దగ్గర ఉంటుంది.

6. ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్, ఉదయ్‌పూర్
రాజరిక వాస్తుకళ, కట్టడాల ఉనికి బయటపడే నగరం ఉదయ్‌ఫూర్‌లో ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌ను నిర్వహిస్తున్నది. ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ ఉండే ఈ హోటల్‌లో ఒక రోజు రాత్రి ఉండేందుకు దాదాపు రూ. 2,50,000 ఖర్చు అవుతుంది.

7. ది ఒబెరాయ్ అమర్‌విలాష్, ఆగ్రా
తాజ్‌మహల్‌కు సమీపంలో ప్రకాశవంతమైన ఠీవితో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ అమర్‌విలాస్. ఇది ఆగ్రా నగరంలో ఉంటూ ఒక మరిచిపోలేని అనుభూతిని చూపరులకు ఇస్తుంది. ఈ హోటల్ గదుల నుంచి తాజ్‌మహల్ అందాన్ని ఆస్వాదించవచ్చు. అమర్‌విలాస్ లోని కోహినూర్ సూట్ గది అద్దె ఒక రాత్రికి రూ.2,50,000 వరకూ ఉంటుంది.

8. తాజ్ లాండ్స్ ఎండ్, ముంబయి
బాంద్రా-వూర్లి సముద్ర అనుసంధానం స్పష్టంగా కనిపించేలా బాంద్రా ఏరియాలో నిర్మించిన హోటల్ ఇది. ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్లో ఒక రాత్రి ఉండేందుకు రూ.2,50,000 ఖర్చు.

9. తాజ్ ఫలక్‌నామా ప్యాలెస్, హైదరాబాద్
తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ అనేది ఒకప్పుడు నిజాం రాజులు నివాసం ఉన్న స్థలం.దీన్ని తాజ్ గ్రూప్ హోటల్ అండ్ రిసార్ట్స్ వారికి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇక్కడ గ్రాండ్ రాయల్ సూట్‌లో ఒక రోజు రాత్రి ఉండటానికి రూ.1,95,000 వసూలు చేస్తారు.

10. ది తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్, ముంబయి
దేశంలో అందరూ బాగా వినే, పురాతన హోటల్ ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్. ఇక్కడ నుంచి చూస్తే గేట్ వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. ఈ హోటళ్లో ఒక్కో గదిలో రాత్రి బస చేసేందుకు రూ.1,75,000 వరకూ ఖర్చవుతుంది.


Click it and Unblock the Notifications