బిఆర్-5, సిఆర్-5 మోడళ్ల ధరలను పెంచిన హోండా
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తమ సిటీ, బిఆర్-5, సిఆర్-5 మోడళ్ల వాహన ధరలను దాదాపు 7 వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల మేరకు పెంచింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తమ సిటీ, బిఆర్-5, సిఆర్-5 మోడళ్ల వాహన ధరలను దాదాపు 7 వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల మేరకు పెంచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్టి)లో ప్రభుత్వం అదనంగా 2 నుంచి 7 శాతం మేరకు నష్టపరిహార సెస్సు విధించడంతో తమ వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని, పెరిగిన ధరలు ఈ నెల 11వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కారు రకాలను బట్టి మిడ్ సైజ్డ్ సెడాన్ 'సిటీ' మోడల్ కారు ధరను రూ.7,003 నుంచి రూ.18,791 మేరకు పెంచిన హెచ్‌సిఐఎల్, బిఆర్-5 ఎస్యువి ధరను రూ.12,490 నుంచి రూ.18,242 మేరకు, అలాగే సిఆర్-5 ఎస్యువి ధరను రూ.75,304 నుంచి రూ.89,069 మేర పెంచింది.

ఇదేవిధంగా మరో ఆటోమొబైల్ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) కూడా కొద్ది రోజుల క్రితం తమ ఇన్నోవా క్రిస్టా, ప్రీమియం ఎస్యువి ఫార్చ్యూనర్ మోడళ్లు సహా ఎంపిక చేసిన కొన్ని మోడళ్ల ధరలను రూ.13 వేల నుంచి రూ.1.6 లక్షల మేరకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications