For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 31 పాయింట్లు లాభ‌ప‌డి 32,272 వ‌ద్ద, నిఫ్టీ 1 పాయింట్ న‌ష్టంతో 10085 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లాభ‌ప‌డ‌టం వ‌రుస‌గా ఇది ఏడో సెష‌న్‌.

|

స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్నాయి. ఉత్త‌ర కొరియా టెన్ష‌న్‌తో న‌ష్ట‌పోయిన మార్కెట్లు మ‌ధ్యాహ్నం త‌ర్వాత కాస్త కోలుకుని సానుకూలంగా క‌దిలాయి. మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 31 పాయింట్లు లాభ‌ప‌డి 32,272 వ‌ద్ద, నిఫ్టీ 1 పాయింట్ న‌ష్టంతో 10085 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లాభ‌ప‌డ‌టం వ‌రుస‌గా ఇది ఏడో సెష‌న్‌.

 సానుకూలంగానే మార్కెట్లు

ఉత్త‌ర కొరియా జ‌పాన్ మీదుగా జ‌రిపిన క్షిప‌ణి ప‌రీక్ష‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు త‌లెత్తాయి. ఇది స్టాక్ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూప‌డంతో అమెరికా స్టాక్ ఫ్యూచ‌ర్లు, ఆసియా షేర్లు దిగ‌జారాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(1.04%), టెక్నాల‌జీ(0.77%), లోహ రంగం(0.29%), చ‌మురు,స‌హ‌జ వాయువు(0.28%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు ప‌వ‌ర్‌(0.9%), స్థిరాస్తి(0.49%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.36%), బ్యాంకింగ్(0.35%) న‌ష్ట‌పోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఓఎన్‌జీసీ(4.71%), బ‌జాజ్ ఆటో(3.19%), కోల్ ఇండియా(1.94%), ఇన్ఫోసిస్‌(1.83%), విప్రో(0.65%) ఉండ‌గా ; డాక్ట‌ర్ రెడ్డీస్(1.77%), ఐటీసీ(0.92%), ఎన్టీపీసీ(0.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.68%), టాటా మోటార్స్‌(0.66%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు | Asian shares dip after North Korean missile launch

The Sensex and Nifty ended little changed on Friday as tensions following another missile launch by North Korea dampened the sentiment with profit-booking seen in recent outperformers such as banks and pharma stocks.
Story first published: Friday, September 15, 2017, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X