3 ఏళ్లలో 30 కోట్ల బ్యాంకు ఖాతాలు
జన్‌ధన్ యోజనలో భాగంగా 30 కోట్ల కుటుంబాలు బ్యాంకు ఖాతాలు తెరిచాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జన్ ధన్ యోజన పథకం... అందరికీ బ్యాంకింగ్ సేవలు అ
జన్‌ధన్ యోజనలో భాగంగా 30 కోట్ల కుటుంబాలు బ్యాంకు ఖాతాలు తెరిచాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జన్ ధన్ యోజన పథకం... అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో వచ్చినట్లు గుర్తుచేశారు. ఢిల్లీలో ఫైనాన్సియల్ ఇంక్లూజన్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ పాల్గొని మాట్లాడారు.

99 శాతం మందికి ఖాతాలు
జన్ ధన్ యోజన పథకం రాకముందు దాదాపు 42 శాతం కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలు లేవని చెప్పారు. అలాంటి వారందరికి ఇప్పుడు జీరో-బ్యాలెన్స్ ఖాతాలు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఉన్నాయని, ఇది జన్ ధన్ యోజన పథకం వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని గృహస్తులు 99 శాతం బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నారని వివరించారు. ఇందుకు జన్ ధన్ యోజన పథకానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

జీరో బ్యాలెన్స్ ఖాతాలు తగ్గాయి
ఇక జన్ ధన్ యోజన ఖాతాలు జీరో-బ్యాలెన్స్‌వే అయినప్పటికీ, మొదట్లో 77 శాతంగా ఉన్న జీరో-బ్యాలెన్స్ ఖాతాలు.. ప్రస్తుతం 20 శాతానికి తగ్గాయని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు. నగదు బదిలీ విధానం విస్తరిస్తే ఈ 20 శాతం ఖాతాల్లోనూ డబ్బులుంటాయని, అప్పుడు జీరో-బ్యాలెన్స్ ఖాతాలే ఉండవని పేర్కొన్నారు.

ఆధార్ తప్పనిసరి
ఇకపోతే గత యూపీఏ ప్రభుత్వం ఆధార్ సంఖ్యను పరిచయం చేసిందని, అయితే దానికి చట్టబద్ధత లేదని, దాన్ని తాము కల్పిస్తున్నామని జైట్లీ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడం అనేది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న పరీక్షకు బిజెపి ప్రభుత్వం తట్టుకుని నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆధార్‌తో ప్రయోజనాలను రాబట్టుకున్న జన్‌ధన్
గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్ల బుకింగ్‌కు ఆధార్ లింకింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21వేల కోట్లు నకిలీ లబ్దిదారుల చేతుల్లో పడకుండా ఆదా చేయగలిగింది. ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాలను ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. 2014 లో జన్‌ధన్ పథకం ప్రారంభం సందర్భంగా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, ఖాతాదారులకు తక్కువ ప్రీమియంలో బీమా పథకాలను సైతం ప్రారంభించారు.


Click it and Unblock the Notifications