56 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

బీఎస్ఈ సెన్సెక్స్ 55.52 పాయింట్ల లాభంతో 32,241.93 వ‌ద్ద, నిఫ్టీ 7.30 పాయింట్ల లాభంతో 10086 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి.

ఫార్మా, బ్యాకింగ్‌, ఐటీ రంగాల షేర్ల రాణింపుతో మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 55.52 పాయింట్ల లాభంతో 32,241.93 వ‌ద్ద, నిఫ్టీ 7.30 పాయింట్ల లాభంతో 10086 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. గ‌త ఐదు సెష‌న్ల‌లో సెన్సెక్స్ 524.44 పాయింట్లు లాభ‌ప‌డింది. ఈ రోజు సెన్సెక్స్ 32,289 వ‌ద్ద ప్రారంభ‌మై 32,328 వ‌ద్ద నుంచి 32,186 మ‌ధ్య ట్రేడైంది.

లాభాల్లో మార్కెట్లు

రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్‌(2.22%), ఇంధ‌న రంగాలు రాణించ‌గా; లోహ రంగం, చ‌మురు,స‌హ‌జ వాయు,స్థిరాస్తి వంటివి న‌ష్ట‌పోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో యాక్సిస్ బ్యాంకు(4.2%), స‌న్ ఫార్మా(4.24%), టాటా మోటార్స్‌(3.6%), అదానీ పోర్ట్స్(3.4%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.8%), సిప్లా(1.89%) ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో విప్రో(4.1%), కొట‌క్ బ్యాంక్(1.17%), ఓఎన్‌జీసీ(1.12%), ఎం అండ్ ఎం(1.06%), భార‌తీ ఎయిర్టెల్(0.70%) ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+