ట్రేడింగ్ వేళలు పొడిగించడం లేదు
దేశ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం లేదని బీఎస్ఈ అధిపతి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న విధంగానే 6.15 గంటలు(9.15-3.30) ట్రేడింగ్ సమయం మాత్రమే కొనసాగుతుందని బీఎస్ఈ ఎండీ,సీఈవో
దేశ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం లేదని బీఎస్ఈ అధిపతి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న విధంగానే 6.15 గంటలు(9.15-3.30) ట్రేడింగ్ సమయం మాత్రమే కొనసాగుతుందని బీఎస్ఈ ఎండీ,సీఈవో ఆశీష్ కుమార్ చౌహాన్ చెప్పారు. ఈ విషయంపై స్టాక్ ఎక్స్చేంజీ కానీ లేదా సబ్ కమిటీ కానీ ఎటువంటి ప్రతిపాదనను సూచించలేదని చౌహాన్ సూచనప్రాయంగా చెప్పారు. దీన్ని మీడియా సృష్టించిన వార్తగా కొట్టిపారేశారు.

ఈ సమస్యకు సంబంధించి చాలా అంశాలు ముడిపడ్డాయని చౌహాన్ అన్నారు. చాలా మంది వేళలు పెంచాలని, కమొడిటీ మార్కెట్లు ఎలా పనిచేస్తాయో కనీసం వారితో సమానంగా తమను పరిగణించాలని కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే కమొడిటీ మార్కెట్లు అర్ధరాత్రి వరకూ పనిచేస్తాయి. అయితే ట్రేడింగ్ సమయాన్ని పెంచడంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవన్నారు. ఎందుకంటే ఇండియా ఐఎన్ఎక్స్ పేరుతో గిఫ్ట్ సిటీలో నడుపుతున్న ఎక్స్చేంజీలో ఎక్కువ సమయం ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. అయితే మరో వైపు ట్రేడింగ్ సమయాన్ని పెంచడం గురించి ఇది చూడాలి. నియంత్రణ సంస్థలు ఎక్కువ సమయం పనిచేయాలి. ఎక్స్చేంజీ ఉద్యోగులు కూడా అధిక సమయాలు కార్యాలయాల్లో ఉండి పనిచేయాల్సి వస్తుంది. అంతే కాకుండా ఇతర మౌలిక సదుపాయాలు(క్లియరెన్స్, సెటిల్‌మెంట్) అదనంగా కల్పించాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications