ఇండిగో విమాన టిక్కెట్లు రూ.1174 నుంచే

చౌక ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ ఇండిగో మ‌ళ్లీ ప్ర‌యాణ టిక్కెట్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇచ్చేందుకు సిద్ద‌మైంది. దేశీయ మార్కెట్‌లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని) ప్ర

చౌక ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ ఇండిగో మ‌ళ్లీ ప్ర‌యాణ టిక్కెట్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇచ్చేందుకు సిద్ద‌మైంది. దేశీయ మార్కెట్‌లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని) ప్రారంభ ధరలను ఆఫర్‌ చేస్తోంది.

 ఇండిగో విమాన టిక్కెట్ ఆఫ‌ర్లు

విమానయానంలో నెలకొన్న బలమైన పోటీని క్యాష్‌ చేసుకునే యోచనలో ఇండిగో ఈ డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. ఇండిగో వెబ్‌సైట్‌ ప్రకారం చెన్నై-బెంగళూరు మార్గంలో టికెట్‌ ధర్‌ రూ.1,174గాను, ఢిల్లీ నుండి జైపూర్ కు రూ.1,178 రూ. జమ్మూ- శ్రీనగర్‌ రూ. 1,220గా ఉంది. శ్రీనగర్-జమ్మూ రూ.1583, రూ. చండీగడ్‌-ఢిల్లీ రూ.1,592, రూ. లక్నో-ఢిల్లీ రూ. 1,597 ధరల్లో టికెట్ లుఅందుబాటులో ఉండనున్నాయి. ఇండిగో బుకింగ్స్ పోర్టల్ లో అక్టోబర్ , నవంబర్ ​కాలానికి చెన్నై - బెంగళూరు మధ్య బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. దీనికి అదననంగా నాన్‌ రిఫండబుల్‌ ఫీజు రూ. 200 ను రద్దు చేయనుంది. అయితే దీనికి ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డులు / డెబిట్ ద్వారా చేసే అన్ని ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.

 ఇండిగో విమాన టిక్కెట్ ఆఫ‌ర్లు

అలాగే ఎయిర్‌ పోర్టుకు అనుకున్న సమయం కంటే ముందుగా చేరుకున‍్న ప్రయాణీకులకు రూ.1000 అదనపు తగ్గింపును ప్రకటించింది. తమ ప్రయాణాన్ని కనీసం నాలుగు గంటలకు ముందుకు జరుపుకున్న వారికి ఇండిగో ఎర్లీ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే టికెట్‌ బుకింగ్‌ సమయంలోఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి వుంటుంది. దేశీయ రూట్లలో డిమాండ్‌ను పెంచడానికి ఈనిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+