For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగ‌స్ట్‌,2017లో అత్య‌ధిక అమ్మ‌కాలు జ‌రిపిన 5 కార్ల కంపెనీలు

ఆగ‌స్ట్‌,2017లో వివిధ కంపెనీలు, మొత్తంగా కార్ల అమ్మ‌కాలు ఎలా సాగాయో తెలుసుకుందాం.

|

సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చ‌ర‌ర్స్‌(సియామ్‌) ఈ నెల‌లో ఆగ‌స్ట్2017కు సంబంధించిన కార్ల అమ్మ‌కాల వివ‌రాల‌ను విడుద‌ల చేసింది. ప్యాసెంజ‌ర్ వాహ‌నాల అమ్మ‌కాలు ఆశాజ‌న‌కంగా ఉండ‌గా, దానికి తోడు మిగిలిన వాటి అమ్మ‌కాలు సైతం కార్ల కంపెనీల‌కు కలిసొచ్చాయి.
ఈ విధంగా చూస్తే వివిధ కంపెనీలు, మొత్తంగా కార్ల అమ్మ‌కాలు ఎలా సాగాయో తెలుసుకుందాం.

మారుతి సుజుకి

మారుతి సుజుకి

దేశీయ మార్కెట్లో ఈ ఏడాది మారుతి సుజుకి ఆగ‌స్టు నెల‌కు 1,51,270 యూనిట్ల అమ్మ‌కాల‌ను చేప‌ట్టింది. ఆగ‌స్టు 2016 నెల‌లో జ‌రిపిన అమ్మ‌కాల‌తో పోలిస్తే 26.12% వృద్ది న‌మోదయింది. స్థానిక మార్కెట్ల‌లో మారుతి సుజుకి డిజైర్ వాహ‌నానికి వ‌చ్చిన డిమాండ్ దీనికి ఒక కార‌ణంగా నిలిచింది. ఇంకా కాంపాక్ట్ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటివి 62.4% వృద్దితో 74,012 యూనిట్ల వ‌ర‌కూ అమ్ముడ‌య్యాయి. యుటిలిటీ విభాగంలో ఎస్‌-క్రాస్‌తో పాటు మారుతి సుజుకి వితారా బ్రీజా, మారుతి సుజుకి ఎర్టిగా ఎక్కువ మందికి ఆసక్తిగా నిలిచాయి. మొత్తం 21,442 యూనిట్ల‌తో 27.6% వృద్ది ఉంది. జులై నెల‌లో ఈ విభాగంలో 11,576 యూనిట్ల‌ను ఎగుమ‌తి చేశారు.

 హుందాయ్ మోటార్ ఇండియా

హుందాయ్ మోటార్ ఇండియా

హుందాయ్ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన హుందాయ్ వెర్నా, హుందాయ్ యాక్సెంట్ అప్‌డేట్‌డ్ వెర్ష‌న్ల‌తో హుందాయ్ దేశీయ మార్కెట్లో 9% వృద్దిని న‌మోదు చేసింది. ఆగ‌స్టు నెల‌లో మొత్తం ఈ కంపెనీ 47,013 కార్ల అమ్మ‌కాలు జ‌ర‌ప‌గ‌లిగింది. అయితే ఎగుమ‌తుల్లో క్షీణ‌త మూలంగా ఒక‌ప్పుడు అత్య‌ధిక కార్ల ఎగుమ‌తిదారు అనే ముద్ర‌ను పోగొట్టుకుంది. ఎక్కువ‌గా స్థానిక అమ్మ‌కాల‌పై దృష్టి సారించ‌డంతో ఎగుమతుల మీద ప‌ట్టు పోయిన‌ట్ల‌యింది.

 మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా మోటార్స్‌

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా మోటార్స్‌

అధిక ధ‌ర‌ల్లో ఉన్న వాహ‌నాల మీద ప్ర‌భుత్వ సెస్ ప్ర‌భావం ప‌డిన‌ప్ప‌టికీ, మ‌హీంద్రా అమ్మ‌కాల సంఖ్య‌ను ఆశాజ‌న‌కంగానే అందుకోగ‌లిగింది. ఆగ‌స్టు నెల‌కు 5.91% వృద్దితో 19,325 వాహ‌న అమ్మ‌కాల‌ను మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చేప‌ట్టింది. మ‌రోవైపు ఎగుమ‌తుల విష‌యంలో 47.8% క్షీణ‌త‌తో కేవ‌లం 533 వాహ‌నాల‌ను మాత్ర‌మే విదేశాల్లో అమ్మ‌గ‌లిగింది. అయిన‌ప్ప‌టికీ దేశంలో చేప‌ట్టిన‌వి, ఎగుమ‌తులు అన్ని క‌లిపితే మ‌హీంద్రా 21,623 యూనిట్ల‌ను అమ్మి మూడో స్థానంలో నిలిచింది. అయితే స్థానిక మార్కెట్ల‌లో గ్రామీణ ప్రాంతాల‌కు సంబంధించి ఎం అండ్ ఎం బాగా చొచ్చుకుపోయింది.

హోండా కార్స్ ఇండియా

హోండా కార్స్ ఇండియా

ఆగ‌స్టు నెల‌లో 17 వేలకు పైగా కార్ల‌ను హోండా కంపెనీ అమ్మ‌గ‌లిగింది. WR-V సిరీస్ విజ‌య‌వంతం అవ‌డంతో హోండా కార్ల కంపెనీ నాలుగో స్థానంలో నిలిచింది. 2016 ఆగ‌స్టు నెల‌తో పోలిస్తే గ‌త నెల‌లో 24.56% వృద్ది నమోద‌యింది. న‌గ‌రాలను కాద‌ని దేశ‌మంతా విస్త‌రించాల‌ని చూస్తున్న హోండా కొత్త మోడ‌ల్ విజ‌య‌వంతం అవ‌డంతో ఈ కంపెనీకి స‌రికొత్త ఉత్సాహం వ‌చ్చింది.ఇక ఎగుమతుల విష‌యానికి వ‌స్తే గ‌తేడాదితో పోలిస్తే 4% త‌గ్గుద‌ల‌తో 575 వాహ‌నాల‌ను విదేశీ మార్కెట్ల‌కు పంపింది.

 టాటా మోటార్స్‌

టాటా మోటార్స్‌

హొండా 17 వేల కార్ల‌తో 4వ స్థానంలో ఉండ‌గా, దానికి మ‌రీ దూరంలో కాకుండా 16,261 యూనిట్ల దేశీయ అమ్మ‌కాల‌తో టాటా మోటార్స్‌ 5వ స్థానంలో ఉంది. గ‌తేడాది ఆగ‌స్ట్ అమ్మ‌కాల‌తో పోలిస్తే ఈ సంస్థ 11.53% వృద్ది క‌న‌బ‌రిచింది. కార్ ప్రియుల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా రిలీజ్ చేసిన టియాగో, టిగోర్‌, హెక్సా వంటి ఉత్ప‌త్తుల‌తో దేశీయ యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు స‌రైన వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఇక నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రాక‌తో కంపెనీ భ‌విష్య‌త్తు మ‌రింత ఆసక్తిక‌రంగా నిల‌వ‌నుంది.

ఆగ‌స్టు,2016తో ఈ సారి పోలిక‌

ఆగ‌స్టు,2016తో ఈ సారి పోలిక‌

ప్యాసెంజ‌ర్‌, యుటిలిటీ వాహనాలు వీటి మొత్తంలో ఎస్‌యూవీలు, వ్యాన్లు దాదాపు 14% వృద్దిని క‌న‌బ‌రిచాయి. కార్ల విష‌యంలో 11.80%, యుటిలిటీ వాహ‌నాలలో 20% పెరుగుద‌ల ఉంది. దేశీయ మార్కెట్లో కార్ల అమ్మ‌కాలు ఆగ‌స్టు,2016లో 1,77,829 యూనిట్లు కాగా ఆగ‌స్టు,2017లో 1,98,811 అమ్మ‌కాలు జ‌రిగాయి. యుటిలిటీ అమ్మ‌కాలు 78,664 యూనిట్లు, వ్యాన్లు ఆగ‌స్టు నెల అమ్మ‌కాలు 16,860 యూనిట్లు న‌మోద‌య్యాయి. ఆగ‌స్టు 2016 నెల‌లో దేశం నుంచి జ‌రిగిన కార్ల ఎగుమ‌తుల సంఖ్య 75,412గా ఉండ‌గా ఈసారి 56,754 యూనిట్లు ఎగుమ‌తి అయ్యాయి.

Read more about: cars sales
English summary

ఆగ‌స్ట్‌,2017లో అత్య‌ధిక అమ్మ‌కాలు జ‌రిపిన 5 కార్ల కంపెనీలు | Top five carmakers in India in August 2017

Top five carmakers in India in August 2017: Maruti Dzire a hit, Honda too gets the success it was looking fo
Story first published: Wednesday, September 13, 2017, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X