సెన్సెక్స్ లాభాల్లో , నిఫ్టీ నష్టాల్లో
స్టాక్ మార్కెట్ సూచీలు ఇలా మిశ్రమంగా స్పందించాయి. ట్రేడింగ్ మొదలయినప్పటి నుంచి లాభాలతో కొనసాగిన మార్కెట్లు మిడ్ సెషన్వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించగలిగాయి.
* 10 వేలకు పైనే నిప్టీ
స్టాక్ మార్కెట్ సూచీలు ఇలా మిశ్రమంగా స్పందించాయి. ట్రేడింగ్ మొదలయినప్పటి నుంచి లాభాలతో కొనసాగిన మార్కెట్లు మిడ్ సెషన్వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించగలిగాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం లేకుండా చాలా సేపు సానుకూల ధోరణి మార్కెట్లలో చాలా సేపు ఉండింది.అయితే మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 32,186.41 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 13.75 పాయింట్లు నష్టపోయి 10079 వద్ద స్థిరపడింది.

రెండు సూచీల్లోనూ సన్ ఫార్మాస్యూటికల్స్, రిలయన్స్, టాటా పవర్, సన్‌ఫార్మా లాభాలు గడించగా... ఐటీసీ, సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దాదాపు 4% పైకి ఎగశాయి. విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రభుత్వం 50% పెంచడంతో ఆర్థిక సంస్థ క్యాపిటల్ ఫస్ట్ దాదాపు 9 ఏళ్ల గరిష్టానికి వెళ్లింది.
సెన్సెక్స్ బలంగా ప్రారంభమై సానుకూలంగా కొనసాగుతూ ఈ రోజు ట్రేడింగ్‌లో 32,348.30 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెన్సెక్స్ కనిష్టానికి వెళ్లి 32,126 పాయింట్ల వరకూ వెళ్లింది. ట్రేడింగ్ చివరి ఒక గంటలో యూరోపియన్ మార్కెట్లు ప్రభావం చూపడంతో పాటు, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు అనుకోని మలుపు తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications