రూ.100 నాణెం త్వరలో మార్కెట్లోకి
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం ఎంజీఆర్ 100 ఏళ్ల జయంతుత్సవాలను పురస్కరించుకుని రూ.100 నాణెం మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
ప్రభుత్వం త్వరలో రూ.100 నాణెం విడుదల చేయనుందని ఆర్థిక శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం ఎంజీఆర్ 100 ఏళ్ల జయంతుత్సవాలను పురస్కరించుకుని రూ.100 నాణెం మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. అంతే కాకుండా రూ.100తో పాటు రూ.5 నాణేన్ని కూడా తీసుకువస్తున్నట్లు పీటీఐ నివేదించింది. ఈ కాయిన్లపై ఎంజీఆర్ బొమ్మ, నాణెంలో కింది అర్థ భాగంలో ఎంజీఆర్ శత జయంత్యుత్సవాలు అనే రాత ఉంటుంది. అది పై అర్ధ భాగంలో దేవనాగిరి లిపిలో ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం ఎంజీఆర్ బొమ్మ కింద 1917-2017 అని ఉంటుంది. కాయిన్లన్నింటిపై అశోక స్తూపం మధ్యలో సత్యమేవ జయతే అని రాతతో ఉంటుంది.

రూ.100 నాణెం బరువు 35 గ్రాములు, రూ.5 నాణెం బరువు 6 గ్రాములుగాను ఉంటాయి. కొత్త రూ.100 నాణెం 50% వెండి, 40% కాపర్, 5% నికెల్ , 5% జింక్ మిశ్రమాలతో తయారవుతుంది. అదే రూ.5 నాణెం అయితే కాపర్(75%), జింక్(20%), నికెల్(5%) లోహాలతో తయారవుతుంది. ఎంజీఆర్ తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన ఆయన రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications