276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ ఇన్వెస్టర్లు ఆశావాహంగా ఉండటంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్‌లో దాదాపు 300 పాయింట్లు పుంజుకుంది.
దేశీయ ఇన్వెస్టర్లు ఆశావాహంగా ఉండటంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్‌లో దాదాపు 300 పాయింట్లు పుంజుకుంది. ఉత్తర కొరియా హూంకరింపులు, అమెరికాలో హరికేన్ భయాలతో ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం కనిపించింది. ఆయా దేశాల సూచీలన్నీ లాభాలతో ట్రేడింగ్ సాగించాయి.

మార్కెట్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 276.50 పాయింట్లు లాభపడి 32,158.66 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 10093 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.11%), హెల్త్ కేర్(1.68%), చమురు,సహజ వాయు(1.64%), మౌలిక రంగం(1.44%) లాభపడ్డాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో టాటా స్టీల్(3.3%), సన్ ఫార్మా(3.17%), టాటా మోటార్స్(3.14%), హెచ్‌యూఎల్(2.26%), ఎంఅండ్ ఎం(1.66%) ముందుండగా, మరో వైపు విప్రో(1.00%), ఓఎన్‌జీసీ(0.76%), హీరో మోటోకార్ప్(0.72%), ఎన్‌టీపీసీ(0.38%), మారుతి(0.06%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications