స్టాక్ ట్రేడింగ్ సమయం సాయంత్రం 5 వరకూ పెంపు!
దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలనే ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిశితంగా పరిశీలిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలనే ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిశితంగా పరిశీలిస్తోంది. గతంలో సాయంత్రం 5 గంటల వరకు, 5:30 గంటల వరకు, రాత్రి 7:30 గంటల వరకు స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.

అయితే 5 గంటల వరకు పెంచాలనే ప్రతిపాదనపట్ల సెబీ మొగ్గు చూపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెబీకి చెందిన ఓ సలహా కమిటీ దీనిపై చర్చలు జరపనుండగా, ట్రేడింగ్ సమయం పెంచడం వల్ల వ్యయప్రయాసలకు గురవుతామన్న అభిప్రాయాలను కొందరు బ్రోకర్లు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క బ్రోకర్లు అభ్యంతపెడుతున్నప్పటికీ.. సెబీ పెంపు దిశగానే వెళ్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18న సెబీ బోర్డు సమావేశం జరగనుండగా, అందులో ఈ ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకే ట్రేడింగ్ జరుగుతున్నది తెలిసిందే. 2009లో మార్కెట్ ప్రారంభ సమయాన్ని ఉదయం 9:45 గంటల నుంచి 9 గంటలకు మార్చారు. 2009 అక్టోబర్‌లోనే ట్రేడింగ్ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచుకోవచ్చని స్టాక్ మార్కెట్లకు సెబీ అనుమతిచ్చింది. అయతే అప్పుడు బ్రోకర్లు వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు. తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి రాగా, ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత సెబీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications