30 వస్తువుల మీద జీఎస్టీ తగ్గింపు
శనివారం హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖాదీ పరిశ్రమకు శుభవార్త చెప్పిన జీఎస్టీ పెద్ద కార్లపై పన్ను రేట్లను మాత్రం బాదేసింది.
శనివారం హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖాదీ పరిశ్రమకు శుభవార్త చెప్పిన జీఎస్టీ పెద్ద కార్లపై పన్ను రేట్లను మాత్రం బాదేసింది. కొన్ని చేతివృత్తులపై కూడా పన్ను తగ్గించింది. మొత్తం మీద సామాన్యులు, పేదలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ఖాదీకి పూర్తిగా GST నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. మధ్యస్థాయి కార్లపై 2 శాతం సెస్ , పెద్ద కార్లపై 5 శాతం, ఎస్ యూవీలపై 7 శాతం పన్ను పెంచుతున్నామన్నారు. చిన్నకార్లు, 13 సీట్లు, హైబ్రిడ్ వాహనాలపై మాత్రం యథాతథ స్థితిని కొనసాగిస్తామన్నారు. ట్రేడ్ మార్కు, బ్రాండెడ్ ఆహారపదార్థాలపై పన్నును 5శాతం విధిస్తున్నామన్నారు జైట్లీ.

ధరలు తగ్గే వస్తువులు
కస్టర్డ్ పౌడర్, తెలికపిండి, ధూప్‌బత్తి, ధూప సంబంధిత ఉత్పత్తులు, ప్లాస్టిక్ రెయిన్‌కోట్, రబ్బరు బ్యాండ్లు, బియ్యం ఊకను ఏరివేసేందుకు ఉపయోగించే రబ్బరు రోల్స్, కంప్యూటర్ మానిటర్లు, కిచెన్ గ్యాస్ లైటర్లు, బ్రష్‌లు, చీపుర్లపైనా జీఎస్టీ భారాన్ని తగ్గించినట్టు తెలుస్తున్నది. హస్తకళలు, ఖాదీ ఉత్పత్తులకు కొన్ని మినహాయింపులను ఇచ్చారు. హస్తకళల వస్తువుల రవాణా, విక్రయాలకు రూ.20 లక్షల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇడ్లీ, దోశలకు వాడే పిండి, పన్నీరు, చింతపండు, వంట గదులలో ఉపయోగించే గ్యాస్ లైటర్లవంటి వస్తువులు తాజా నిర్ణయంతో తక్కువ ధరకే లభ్యం కానున్నాయి.
GST అమలు తీరుపై కౌన్సిల్ లో మాట్లాడామన్నారు జైట్లీ. సమావేశంలో మొత్తం 30 వస్తువుల పన్నురేట్లపై చర్చించినట్లు తెలిపారు. GSTకి అర్హులైన వారిలో 70 శాతానికిపైగా రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. జీఎస్టీ ఫైల్ చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈజీ మెథడ్ కోసం కమిటీని కూడా ఏర్పాటుచేయాలని కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. సాంకేతిక సమస్యలతో రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువుని అక్టోబర్ 10వరకూ పొగిడించినట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ప్రాజెక్టులపై పన్ను తగ్గించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారని... దీనిపై తర్వాత జరిగే కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన డెఫినేషన్ ఇంకా విస్తృత పర్చేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు.


Click it and Unblock the Notifications