For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెక్ డొనాల్డ్ బ్రాండ్ కిందే 169 స్టోర్లు కొన‌సాగుతాయ‌న్న విక్ర‌మ్ బ‌క్షి

మెక్‌డొనాల్డ్‌తో ఉత్త‌ర‌, తూర్పు భార‌తాల్లో జ‌ట్టు క‌ట్టి ఆ బ్రాండ్ కింద న‌డుపుతున్న 169 స్టోర్ల విష‌యంలో వివాదం తెచ్చుకున్న విక్ర‌మ్ బ‌క్షి ఆ బ్రాండ్ పేర్ల‌తో అవ‌న్నీ కొన‌సాగుతాయ‌ని శుక్ర‌వారం చెప్పా

|

మెక్‌డొనాల్డ్‌తో ఉత్త‌ర‌, తూర్పు భార‌తాల్లో జ‌ట్టు క‌ట్టి ఆ బ్రాండ్ కింద న‌డుపుతున్న 169 స్టోర్ల విష‌యంలో వివాదం తెచ్చుకున్న విక్ర‌మ్ బ‌క్షి ఆ బ్రాండ్ పేర్ల‌తో అవ‌న్నీ కొన‌సాగుతాయ‌ని శుక్ర‌వారం చెప్పారు. మెక్‌డొనాల్డ్ గ‌త నెల‌లోనే ఫ్రాంచైజీ ఒప్పందాన్ని ముగిస్తూ సెప్టెంబ‌రు 6 నుంచి ఆ 169 స్టోర్లు త‌మ బ్రాండ్ పేరు, వ్యాపార నిర్వ‌హ‌ణ విధానాల‌ను కొన‌సాగించ వీల్లేద‌ని చెప్పింది. దీని ప్ర‌కారం మెక్‌డొనాల్డ్ మేధో హ‌క్కుల‌ను విక్ర‌మ్ బ‌క్షి న్యాయ‌బ‌ద్దంగా ఉప‌యోగించే వీల్లేదు. సీపీఆర్‌ఎల్ అనేది విక్ర‌మ్ బ‌క్షి, మెక్ డొనాల్డ్ ఉమ్మ‌డి వెంచ‌ర్‌. దీని ద్వారా విక్ర‌మ్ బ‌క్షి ఉత్త‌ర భార‌త‌దేశం, తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల్లో మెక్డొనాల్డ్ ఫ్రాంచైజీల‌ను న‌డుపుతున్నారు.

 ఆ 169 స్టోర్లు మెక్ డొనాల్డ్ బ్రాండ్ కిందే కొన‌సాగుతాయ్‌

గ‌త రెండు నెల‌లుగా ఫ్రాంచైజీకి సంబంధించి రెండు పార్టీల మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌లో సైతం బ‌క్షికి స్వాంత‌న వచ్చే తీర్పు రాలేదు. ఫ్రాంచైజీ ముగింపుపై స్టే ఇచ్చేందుకు ట్రిబ్యున‌ల్ నిరాక‌రించింది. అయితే ఒప్పందం ముగిసే విధంగా మెక్‌డొనాల్డ్ నిర్ణ‌యం, ట్రిబ్యున‌ల్ తీర్పు వీట‌న్నింటిపై బోర్డు స‌మావేశ‌మ‌వుతుంద‌ని బ‌క్షి చెప్పారు. సీపీఆర్ఎల్‌ బోర్డు నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కూ ఇది వ‌ర‌కూ ఉన్న య‌థాత‌థ స్థితి కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. దీన్ని బ‌ట్టి 169 స్టోర్లు అలానే నిర్వ‌హిస్తార‌ని అర్థః చేసుకోవ‌చ్చు.

Read more about: mcdonald brand
English summary

మెక్ డొనాల్డ్ బ్రాండ్ కిందే 169 స్టోర్లు కొన‌సాగుతాయ‌న్న విక్ర‌మ్ బ‌క్షి | Those 169 oullets will continue under Mcdonalds brand

169 outlets in north and east will continue to operate under McDonald’s brand: Vikram Bakshi
Story first published: Saturday, September 9, 2017, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X