For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్‌స్టార్ కోసం రూ.1200 కోట్లు ఖ‌ర్చుపెట్ట‌నున్న స్టార్ ఇండియా

ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కులు ద‌క్కించుకోవ‌డ‌మే అంత సులువైన విష‌యం కాదు. అందు కోసం అంత‌ర్జాతీయంగా విప‌రీత‌మైన ఆస‌క్తి ఉంటుంది. మొత్తానికి రూ.16 వేల కోట్ల మొత్తానికి స్టార్ ఇండియా ఆ ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్క

|

ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కులు ద‌క్కించుకోవ‌డ‌మే అంత సులువైన విష‌యం కాదు. అందు కోసం అంత‌ర్జాతీయంగా విప‌రీత‌మైన ఆస‌క్తి ఉంటుంది. మొత్తానికి రూ.16 వేల కోట్ల మొత్తానికి స్టార్ ఇండియా ఆ ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకోగ‌లిగింది. టీవీ, డిజిటిల్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం రూ.16 వేల కోట్ల‌ను బీసీసీఐకి చెల్లించాలి. అయితే ఇక ముందే ఉంది అస‌లైన వ్యాపారం. ప్ర‌సారాల‌ను ఏ విధంగా వైవిధ్యంగా చేస్తూ డ‌బ్బు తిరిగి రాబ‌ట్టుకోవ‌డ‌మనేది స్టార్ ఇండియా చేతిలో ఉంది. దీని కోసం ఒక ప్ర‌ణాళిక వేసింది. అదేంటో తెలుసుకుందాం.

1. హాట్‌స్టార్ ద్వారా ఇత‌ర సంస్థ‌ల‌కు పోటీ

1. హాట్‌స్టార్ ద్వారా ఇత‌ర సంస్థ‌ల‌కు పోటీ

మ‌న దేశంలో యువ‌త స‌గ‌టున 4 గంట‌లు మొబైల్ యాప్స్‌లో గ‌డ‌ప‌డం చేస్తున్నారు. ఇక్క‌డే స్టార్ ఇండియా త‌న వ్యాపార ప్ర‌ణాళిక‌ను ఆలోచించింది. ఓవ‌ర్ ది టాప్‌(ఓటీటీ) ప్లాట్‌ఫారంలో త‌న వ‌ద్ద ఉన్న హాట్‌స్టార్‌ను స‌మ‌ర్థంగా వినియోగించేందుకు స్టార్ నెట్వ‌ర్క్ సిద్ద‌మైంది. త‌న పోటీదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ ప‌డేందుకు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకోనుంది.

2. రూ.1200 కోట్లు

2. రూ.1200 కోట్లు

హాట్‌స్టార్‌ను నోవీ డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్వ‌హిస్తున్న‌ది. దీని కోసం దాదాపు స్టార్ ఇండియా రూ.1200 కోట్ల‌ను కేటాయించింది. ఇందుకోసం 6 నెల‌ల నుంచే ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు తెలుస్తోంది. 2 తీర్మానాల ద్వారా హాట్‌స్టార్ కోసం కావాల్సిన బ‌డ్జెట్‌ను కేటాయించిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి సమ‌ర్పించిన పత్రాలు సైతం దీన్నే బ‌య‌ట‌పెట్టాయి.

3. కొత్త‌గా చందాదారులు హాట్‌స్టార్‌కు చేర‌తారా!

3. కొత్త‌గా చందాదారులు హాట్‌స్టార్‌కు చేర‌తారా!

హాట్‌స్టార్‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డుల‌కు సంబంధించి కంపెనీ ముఖ్య‌మైన రెండు తీర్మానాల‌ను చేసింది. ఇందులో ఒక‌టి రూ. 710 కోట్లు, రెండోది రూ.522 కోట్ల‌తో రెండు తీర్మానాలు చేసి త‌ద్వారా హాట్‌స్టార్‌కు అవ‌స‌మ‌రైన డ‌బ్బును స‌మ‌కూర్చ‌నున్నారు. ఐపీఎల్ డిజిట‌ల్ హ‌క్కులు స్టార్ ఇండియాకు ద‌క్క‌డంతో హాట్‌స్టార్‌కు కొత్త‌గా డిజిట‌ల్ వినియోగ‌దారుల‌ను సంపాదించుకోవ‌చ్చ‌ని ఆ సంస్థ యోచిస్తోంది. త‌ద్వారా హాట్‌స్టార్ యాప్‌కు కొత్త‌గా చందాదారులు పెరుగుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.

4. వీడియో ప్ర‌పంచంలో అమెజాన్ ఇలా...

4. వీడియో ప్ర‌పంచంలో అమెజాన్ ఇలా...

అమెరికా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కంటెంట్ ప్లాట్ ఫారంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఏటీపీ టెన్నిస్ టూర్‌ను ప్ర‌సారం చేసేందుకు స్కై నెట్‌వ‌ర్క్‌ను తోసిరాజ‌ని హ‌క్కులు ద‌క్కించుకుంది. అమెజాన్‌కు ఉన్న అపార‌మైన ఆద‌ర‌ణ ద్వారా ప్రపంచ‌వ్యాప్తంగా వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను ద‌క్కించుకోవ‌డం పెద్ద విష‌యేమీ కాదు.

 5. స్థానిక కంటెంట్

5. స్థానిక కంటెంట్

ఒక ప‌క్క అమెజాన్‌, మ‌రో వైపు నెట్‌ఫ్లిక్స్ త‌మ అప్లికేష‌న్ల‌కు చందాదారుల‌ను ఎక్కువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇదే త‌రుణంలో గేమ్ ఆఫ్ థోర్న్స్ ద్వారా భార‌త్‌లో హాట్‌స్టార్ త‌న ప‌ట్టును నిలుపుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. అయితే హాట్‌స్టార్‌కు ఉన్న ప్ర‌ధాన బ‌లం దేశీయంగా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే స్థానిక కంటెంట్‌ను త‌న ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం. అయితే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఈ విష‌యాన్ని గ్ర‌హించి ఇప్పుడిప్పుడే భార‌త వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని వీడియోల రూపంలో త‌యారుచేసే ప‌నిలో పడ్డాయి. ఈ దిశ‌లో స్థానిక సినిమా వీడియోల‌ను యాప్‌ల‌లో అందుబాటులో ఉంచ‌డం ఒక మార్గం.

6. కంటెంట్ మాట స‌రే... మ‌రి డ‌బ్బు...

6. కంటెంట్ మాట స‌రే... మ‌రి డ‌బ్బు...

పెద్ద స్థాయిలో వీడియోల‌ను సంగ్ర‌హించి డేటాబేస్ త‌యారుచేయ‌డం ఏ సంస్థ‌కైనా అంత సులువైన విష‌యం కాదు. అందుకు సంస్థ‌లు అవ‌లంబిస్తున్న విధానం వాటి యాప్‌ల‌ను వాడాలంటే యూజ‌ర్లు డ‌బ్బు చెల్లించేలా చేయ‌డం. ఇందుకోసం ఏటా అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్ కోసం రూ.499, నెట్‌ఫ్లిక్స్ రూ.500 వార్షిక రుసుములుగా స్వీక‌రిస్తున్నాయి. అయితే హాట్‌స్టార్ ప్రారంభంలోనే నెల‌కు రూ.149తో మొద‌లెట్టింది. అయితే ఇప్పుడున్న నివేదిక‌ల‌ను బ‌ట్టి తెలుస్తుందేంటంటే 9 నెల‌ల‌కు, ఏడాది కాలానికి సైతం హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందుబాటులో ఉంచుతోంది.

 7. స్థానిక‌ కంటెంట్ మీదే హాట్‌స్టార్ దృష్టి

7. స్థానిక‌ కంటెంట్ మీదే హాట్‌స్టార్ దృష్టి

స్టార్ ఇండియా పెడుతున్న ఎక్కువ పెట్టుబ‌డులు కోర్ టెక్నాల‌జీ ప్లాట్‌ఫాంను పెంచ‌డం, స్థానిక కంటెంట్‌ను త‌యారుచేయ‌డం మీదే వినియోగం అవుతున్నాయి. ప్రీమియం స్థానాన్ని కొన‌సాగిస్తామ‌ని నెట్‌ఫ్లిక్స్ దీమాగా ఉండ‌గా, గేమ్ ఆఫ్ థార్న్స్ వంటి ఆట‌ల వ‌ల్ల త‌మ వీడియో యాప్‌ల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు హాట్‌స్టార్ కృషి చేస్తోంది. అంతే కాకుండా ఈ డిజిట‌ల్ కంటెంట్ యాప్‌ల‌న్నీ వివిధ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌తో ఒప్పందాల‌ను కుదుర్చుకుని ప్ర‌త్యేక‌మైన స్థానిక కంటెంట్‌ను త‌యారుచేసే ప‌నిలో పడ్డాయి.

 8. ఈ డిజిట‌ల్ వీడియో ప్ర‌పంచంలో

8. ఈ డిజిట‌ల్ వీడియో ప్ర‌పంచంలో

యూట్యూబ్ త‌ర్వాత ఆన్లైన్ వీడియో వ్యాపారాన్ని అర్థం చేసుకున్న సంస్థలు బాగానే పెరుగుతున్నాయి. వూట్‌, వోజీ, సోనీలైవ్ ఈ రంగంలోని మ‌రిన్ని డిజిట‌ల్ వీడియో ప్లాట్‌ఫారంను సృష్టించిన సంస్థ‌లు. అయితే ఇవ‌న్నీ ఎక్కువ‌గా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఆదాయ మార్గాల‌ను అన్వేషిస్తుండ‌గా; అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మాత్రం పెద్ద సంఖ్య‌లో స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌ను రాబ‌ట్టుకోవ‌డం ద్వారా ఇండియాలో రెవెన్యూకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాయి. అమెజాన్ కంటెంట్ వ్యాపారం కోసం దాదాపు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల‌ను కేటాయించింద‌ని డిజిట‌ల్ వ్యాపార వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. యాప్ అన్నీ జ‌రిపిన సర్వే ప్ర‌కారం నెల‌వారీ యాక్టివ్ యూజ‌ర్లు ఉన్న యాప్‌ల్లో హాట్‌స్టార్ అగ్ర‌స్థానంలో ఉంది.

English summary

హాట్‌స్టార్ కోసం రూ.1200 కోట్లు ఖ‌ర్చుపెట్ట‌నున్న స్టార్ ఇండియా | star India bets 1200 crore on hotstar app for digital video content

Star India, which bagged the India Premier League rights for TV and digital broadcast in a Rs 16,347 crore deal, is placing similar bets on its over- the-top (OTT) platform Hotstar to take on rivals like Amazon's Prime Video and Netflix.
Story first published: Saturday, September 9, 2017, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X