స్తబ్దుగా కొనసాగిన మార్కెట్లు: స‌్వల్ప లాభాలతో ముగింపు
అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి సెంటిమెంట్ మార్కెట్లను బలపరచడం, దేశీయ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను మార్కెట్లో పెట్టడం వంటివి కొనసాగుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లలో పెద్ద మార్పేమీ కనిప
అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి సెంటిమెంట్ మార్కెట్లను బలపరచడం, దేశీయ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను మార్కెట్లో పెట్టడం వంటివి కొనసాగుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. వరుసగా రెండో రోజూ స్తబ్దుగానే కొనసాగాయి. చివరకి స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 24.78 పాయింట్ల లాభంతో 31687.52 వద్ద ముగియగా, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 9935 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే మూలధన వస్తువులు(1.88%), ఎఫ్ఎంసీజీ(0.46%), ఇన్‌ఫ్రా(0.31%), బ్యాంకింగ్(0.03%) లాభపడ్డాయి. మరో వైపు స్థిరాస్తి సూచీ(1.54%), పీఎస్‌యూ(1.01%), హెల్త్ కేర్(0.92%),పవర్(0.9%) నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో ట్రేడింగ్‌లో లాభపడిన వాటిలో ఎల్ అండ్ టీ(3.68%), భారతీ ఎయిర్‌టెల్(0.97%), కొటక్ బ్యాంక్(0.67%), ఐటీసీ(0.61%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.61%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో ఎమ్ అండ్ ఎమ్(3.37%), డాక్టర్ రెడ్డీస్(3.15%), సన్ ఫార్మా(1.89%), బజాజ్ ఆటో(1.35%), ఓఎన్‌జీసీ(1.29%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications