మార్కెట్ క్యాపిటలైజేసన్ 1 ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకున్నారు. విశ్లేషణ ప్రకారం ఇటీవలి వార్షిక నివేదికల ఆధారంగా ఉద్యోగులపై ఎక్కువ సంపాదించిన కంపెనీల జాబితా
ఒక్కో ఉద్యోగి మీద ఎక్కువ సంపాదించే కంపెనీ దేశంలో అని అడిగితే చాలా మంది వివిధ రకాల సమాధానాలు చెబుతారు. ఎక్కువ మంది టీసీఎస్ లేదా రిలయన్స్ అని అంటారు. అయితే అది తప్పు. ఒక బ్రోకరేజీ సంస్థ 76 భారత కంపెనీలపై ఆసక్తికర విషయాలను వెలికి తీసింది. ఇందుకోసం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకున్నారు. విశ్లేషణ ప్రకారం ఇటీవలి వార్షిక నివేదికల ఆధారంగా ఉద్యోగులపై ఎక్కువ సంపాదించిన కంపెనీల జాబితా తెలుసుకుందాం.

1. ఎక్కువ ఉద్యోగులు
దేశంలోని లిస్టెడ్ కంపెనీల్లో కేవలం టీసీఎస్, కోల్ ఇండియాలో మాత్రమే 3 లక్షలకు పైబడి శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.

2. ఈ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు
దేశంలో పని కల్పించే వాటిలో ఆర్థిక రంగం, టెక్నాలజీ కంపెనీలు కలిసి వ్యవస్థీకృత రంగంలో దాదాపు 40% ఉపాధిని కల్పిస్తున్న వాటిలొ ఉంటాయి.

3. అందరి కంటే పెద్ద సీఈవో
ఐపీసీఏ ల్యాబ్స్ సీఈవో ప్రేమ్‌చంద్ గోధా 70 ఏళ్ల వయసులో కంపెనీలకు సంబంధించి అతిపెద్ద వయసు సీఈవోగా పనిచేస్తున్నారు.

4. మహిళా ఉద్యోగులు
మొత్తం ఉద్యోగుల్లో టీసీఎస్ ఎక్కువ మంది మహిళా(34%) ఉద్యోగులను కలిగి ఉంది. పురుష: మహిళా ఉద్యోగుల శాతాల వారీగా చూసినప్పుడు ఇన్ఫోసిస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ శాతంలో ఉంది.

5. వేతనాల తగ్గుదల
కంపెనీల్లో ఉద్యోగుల వేతనాలను బయటకు వెల్లడిస్తున్న వాటిలో, ఎం అండ్ ఎం కంపెనీ విషయంలో 2017 సంవత్సరంలో వేతనాలు 1.5% తగ్గాయి.

6. మహిళా భాగస్వామ్యం
2016లో 21.6% గా ఉన్న మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం 2017 ఏడాదిలో 23 శాతానికి పెరిగింది.

7. వార్షిక నివేదికలు
కంపెనీలు తమ పనితీరుకు సంబంధించి ఏటా మార్కెట్లో వార్షిక నివేదికలను బయటపెడుతుంటాయి. కంపెనీ చేపట్టిన కీలక ప్రాజెక్టులు, ఆర్థిక విషయాలు, భవిష్య ప్రణాళికలు ఇందులో ఉంటాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వార్షిక నివేదికలో సగటున 274 పేజీలు ఉన్నాయి.

8. ఉద్యోగ నియామకాలు
యెస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 34% పెరిగింది. 20 వేల మంది ఎక్కువ జతచేరారు. అదే సమయంలో ఉద్యోగుల మీద చేసే ఖర్చులు 39% పెరిగాయి.

9. అతిపెద్ద వార్షిక నివేదిక
వార్షిక నివేదికలో పెట్టుబడిదారులకు కావాల్సిన చాలా అంశాలు ఉంటాయి. ఇన్వెస్టర్లు దీన్ని చూస్తే కంపెనీపై ఒక సమగ్ర అవగాహన వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వార్షిక నివేదికలో 460 పేజీలు ఉన్నాయి. ఇదే ఈ ఏడాది అదిపెద్ద వార్షిక నివేదిక

10. ఒక్కో ఉద్యోగి ద్వారా కంపెనీ సంపాదించే డబ్బు
సాంకేతిక పెరుగుతున్న కొద్దీ కంపెనీలే తమకు తాముగా ఏదీ ఉపయోగడుతుంది, ఎంత మేరకు ప్రయోజనం, ఎంత మేరకు నష్టం లాంటివి అంచనా వేస్తున్నాయి. ఇదే కోవలో ఒక్కో ఉద్యోగి మీద సంస్థ ఎంత సంపాదిస్తున్నది సైతం లెక్కగడుతున్నాయి. బీఎస్ఈ500 కంపెనీల్లో సగటున ఒక్కో ఉద్యోగి మీద కంపెనీ సంపాదిస్తున్న ఆదాయం 2.7 మిలియన్ రూపాయలు కాగా హెచ్‌డీఎఫ్‌సీ విషయంలో ఇది (3.2 కోట్లు)32 మిలియన్ రూపాయలుగా ఉంది.

11. చిన్న వార్షిక నివేదిక
కోల్ ఇండియా 140 పేజీలతో అతి చిన్న వార్షిక నివేదికను విడుదల చేసింది.

12. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగ నియామకాల్లో అంత తొందరబాటును ప్రదర్శించవు. తమ ఉద్యోగులను 5% మేర పెంచుకున్న వాటిలో కెనరా బ్యాంకు, పీఎన్‌బీ, సిండికేట్ బ్యాంకు, విజయా బ్యాంకు ఉన్నాయి.

13. నోట్ల రద్దు(demonetisation) అనే విషయ ప్రస్తావన
గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన రెండు పెద్ద మార్పులు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ. ప్రత్యక్షంగా, పరోక్షంగా నోట్ల రద్దు చాలా కంపెనీలపై ప్రభావం చూపింది. మొత్తం 75 కంపెనీల్లో 61 కంపెనీలు 469 సార్లు 'పెద్ద నోట్ల రద్దు' అనే పదాన్ని ఉపయోగించాయి. ఎస్‌బీఐ అన్నిటికంటే ఎక్కువగా 29 సార్లు వాడింది.

14. జీఎస్టీ
జీఎస్‌టీ దేశంలో పరోక్ష పన్నుల సంస్కరణలో అతి పెద్దది. 56 కంపెనీలు జీఎస్టీ పదాన్ని 351 సార్లు ఉపయోగించాయి. రిలయన్స్ అత్యధికంగా 26 సార్లు వాడింది.

15. అనుబంధ ఆర్థిక విషయాలు
సంస్థలు తమ వార్షిక నివేదికలతో పాటు అనుబంధ ఆర్థిక విషయాల్లో భాగంగా అంతర్గత అమ్మకాలు, కొనుగోళ్లు, ఆస్తులు, అప్పుల వివరాలను ఇస్తున్నాయి. అంటే తమ అనుబంధ సంస్థల మధ్య జరిగే అంతర్గత లావాదేవీలు ఇందులో ఉంటాయి. ఎల్ అండ్ కంపెనీ 2017లో 5150అనుబంధ పేజీలతొ వార్షిక నివేదికను వెలువరించింది.

16. వేతనంలో వ్యత్యాసం
కంపెనీల్లో ఎక్కడైనా ఎండీకి,సీఈవోకి సగటు ఉద్యోగికి ఉండే వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసాలను గమనిస్తే హీరో మోటోకార్ప్ కంపెనీలో 731 సార్లు కంపెనీ అధినేత వేతనం సగటు ఉద్యోగి కంటే ఎక్కువగా ఉంది. వేతన వ్యత్యాసం అతి తక్కువగా ఎస్‌బీఐలో 2.5 సార్లుగా ఉంది.

17. సీఈవో వేతనం తక్కువ ఉన్నవి
కంపెనీ ఎండీ లేదా సీఈవోవ వేతనం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంకుల్లో అతితక్కువగా రూ.30 లక్షలుగా ఉన్నాయి.

18. దుస్తుల వ్యాపారం ఆన్‌లైన్‌లో
దుస్తుల అమ్మకాల్లో ఆన్‌లైన్ మార్గం ద్వారా జరిగింది 9%. దేశ ఈ-కామర్స్ రంగంలో 30% దుస్తుల మీదే వ్యాపారం జరుగుతోంది.

19. ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లింపు
విద్యుత్ బిల్లు చెల్లింపు ఆన్లైన్‌లో చేపట్టేవారే సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో సీఈఎస్‌సీకి ఆన్‌లైన్ బిల్లు చెల్లింపుల వ్యవస్థ ద్వారా చేసిన వారి సంఖ్య 17.2%గా ఉండగా 2017లో ఇది 28.5% కి పెరిగింది.

20. సినిమా టిక్కెట్ల కొనుగోలు
పీవీఆర్ విషయంలో 2015లో 26% గా ఉన్న ఆన్‌లైన్ మూవీ టిక్కెట్ బుకింగ్ 2017 వచ్చే సరికి 45% అయింది.

21. తక్కువ ఆదాయ గృహ రుణాలు
యాక్సిస్ బ్యాంకు అందించే అల్పాదాయ గృహ రుణాల విలువ 2017లో 66% పెరిగి 31 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

22. స్టీల్ విషయంలో
మార్చి 2020 కల్లా ఉక్కు సామర్థ్యాన్ని ఏటా 23 మెగా టన్నులకు పెంచేందుకు గాను జేఎస్‌డబ్ల్యూ 2680 కోట్ల రూపాయలన ఖర్చుపెట్టాలని ప్రణాళిక వేసుకుంది.

23. పునరుత్పాదక ఇంధనం
ఏసియన్ పెయింట్స్ సంస్థలో మొత్తం ఇంధన అవసరాల్లో 22% పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారానే సమకూరుతోంది.

24. కార్బన్ ఉత్పాదకాలు(కర్బన ఉద్గారాలు)
హిందుస్థాన్ యూనిలీవర్ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గాను పనురాత్పదక ఇంధన వనరులను 28% మేర పెంచుకుంది. తయారీ యూనిట్లలో చూస్తే కర్బన ఉద్గారాల సంఖ్య 13% తగ్గుదల కనబడింది.

25. డేటా అనలిటిక్స్ వినియోగం
కంపెనీల్లో ఇటీవల డేటా విశ్లేషణ(అనలిటిక్స్) పెరిగిపోయింది. మారికో కంపెనీకి డేటా అనలిటిక్స్ వినియోగం మూలంగా అమ్మకాల పొదుపు ఒక పద్దతిగా జరిగి 35 కోట్ల మేర ఆదా అయింది.

26. ఉద్యోగాల సృష్టి
ఉద్యోగార్థులకు, యాజమాన్యాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్న వాటిలో మూడు సంస్థలు ముందున్నాయి. క్వెస్ కార్ప్, టీమ్ లీజ్, ఎస్ఐఎస్ సంస్థలు కలిసి ఏడాదిలో 4.3 లక్షల ఉద్యోగాలను కల్పించాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications