అణు ప్రకంపనల కొనసాగింపుతో ఈ రోజూ...
బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు నష్టపోయి 31,662 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 9916 వద్ద స్థిరపడింది.
ఉత్తర కొరియా అణు పరీక్షల ప్రకంపనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు బుధవారం సైతం నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు నష్టపోయి 31,662 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 9916 వద్ద స్థిరపడింది. మరో వైపు రూపాయి మారకం విలువ డాలరుతో మూడు వారాల కనిష్టాన్ని తాకింది.
ఒక పక్క విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారత్ నుంచి వెనక్కు తీసుకుంటుండగా ఉత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలు జరపడం మరింత చేటు చేసేలా పరిణమించింది. ఇప్పటి వరకూ సెప్టెంబరులో 248.7 మిలియన్ డాలర్లు, ఆగస్టు నెలలో 2 బిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడిదారులు వెనక్కు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఈ ఏడాది నికర కొనుగోళ్లను చూస్తే వారే 7 బిలయన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో టాటా గ్లోబల్ బేవరేజెస్(4.68%), బజాజ్ ఫైనాన్స్(3.93%), మదర్‌సన్ సుమీ(3.31%), కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(2.90%), జేఎస్‌డబ్ల్యూ స్టీల్(2.42%)
మరో వైపు నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా(3.73%),ఐటీసీ(2.43%), టాటా మోటార్స్(2.26%), లుపిన్(2.05%), యాక్సిస్ బ్యాంక్(1.79%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications