దేశంలో అతిపెద్ద రిఫైనరీ సంస్థ 'ఇండియన్ ఆయిల్‌స కాలానికి తగ్గట్లుగా మారాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో తమ సంస్థకు చెందిన బంకుల్లో పెట్రోలు, డీజిల్‌తో పాటు సహజ వాయువు, బయో డీజిల్ వ
దేశంలో అతిపెద్ద రిఫైనరీ సంస్థ 'ఇండియన్ ఆయిల్‌స కాలానికి తగ్గట్లుగా మారాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో తమ సంస్థకు చెందిన బంకుల్లో పెట్రోలు, డీజిల్‌తో పాటు సహజ వాయువు, బయో డీజిల్ వంటి ఇంధనాలను,విద్యుత్ చార్జింగ్ కూడా అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు వేస్తున్నది. దేశం పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2021 నాటికి దేశంలో సహజ వాయువుతో నడిచే వాహనాల సంఖ్యను రెండింతలు చేయాలని, 2030 నాటికి పూర్తిగా దేశంలో విద్యుత్తు కార్లనే విక్రయించేలా చర్యలు చేపట్టేలా సర్కారు ప్రణాళికలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహజ వాయువు, బయో డీజిల్ వాడకాన్ని పెంపొందించడం, విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తుండడంతో ఇండియన్ ఆయిల్ సంస్థ కూడా భవిష్యత్తు అవసరాలు, వ్యాపార పోటీని ఎదుర్కొనేలా తమ వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాలని యోచిస్తోంది.

పరిశోధన బృందాల ఏర్పాటు..
దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ సంస్థఇండియన్ ఆయిల్. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 26,000 బంకుల రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అతిపెద్ద నెట్‌వర్క్‌తో దాదాపు దేశపు సగం ఇంధన అవసరాలను ఇండియన్ ఆయిల్ సంస్థ తీర్చుతూ వస్తోంది. అయితే ఇప్పుడు వాహన ఇంధనాలకు ప్రత్యామ్నాయాల వేట ముమ్మరమవుతుండడంతో ఇకపై తమ రిటైల్ నెట్‌వర్క్‌లోని బంకుల్లో సహజ వాయువును విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడు భవిష్యత్తు సన్నద్ధత నిమిత్తం విద్యుత్తు వాహనాలకు పవర్ ఫిల్లింగ్, ఫ్యూయల్ సెల్స్ రూపకల్పనతో పాటు వివిధ రకాల బయోఫ్యూయెల్స్ అభివృద్ధికి గాను సంస్థ పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications