దేశీయంగా శ‌క్తిమంత‌మైన బ్యాంకుల్లోకి హెచ్‌డీఎఫ్‌సీ

ఏప్రిల్ 1,2018 నుంచి అధిక మూల‌ధ‌న అవ‌స‌రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఉంటుంద‌ని ఆర్బీఐ చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిణామానికి చెందిన ఐదు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

దేశంలో విఫ‌లం అవ్వడానికి అవ‌కాశం లేని బ్యాంకుల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ఆర్బీఐ జ‌త‌చేర్చింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఆ జాబితాలో ఉన్న ఎస్బీఐ, ఐసీఐసీఐ కోవ‌లో ఇది చేరింది. ఈ విధ‌మైన జాబితాలో చేరిన బ్యాంకుల‌కు అధిక మూల‌ధ‌న అవ‌స‌రం ఉంటుంది. ఏప్రిల్ 1,2018 నుంచి అధిక మూల‌ధ‌న అవ‌స‌రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఉంటుంద‌ని ఆర్బీఐ చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిణామానికి చెందిన ఐదు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

1) ఆర్‌బీఐ ప్ర‌క‌టించిన బ్యాంకులు

1) ఆర్‌బీఐ ప్ర‌క‌టించిన బ్యాంకులు

గ‌తంలో రిజ‌ర్వ్ బ్యాంక్ తెలిపిన దాని ప్ర‌కారం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు దేశీయంగా ముఖ్య‌మైన బ్యాంకులుగా ఉన్నాయి. ప్ర‌స్తుతం హెచ్‌డీఎఫ్‌సీ కూడా జ‌త అవ్వ‌డంతో ఇప్పుడు మొత్తం మూడు బ్యాంకులు కానున్నాయి.

2) ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ్యాంకులు ముఖ్యం

2) ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ్యాంకులు ముఖ్యం

ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ్యాంకులు ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే. ఈ త‌ర‌హా బ్యాంకుల‌కు సంబంధించి ఆర్థిక సేవల్లో ఎటువంటి అంత‌రాయాలు క‌ల‌గ‌కుండా స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ‌ను అధిక స్థాయిలో ఉంచుతారు.

 3) ఆర్‌బీఐ ఫ్రేమ్‌వ‌ర్క్‌

3) ఆర్‌బీఐ ఫ్రేమ్‌వ‌ర్క్‌

2014లో దేశీయంగా శ‌క్తిమంత‌మైన బ్యాంకుల జాబితాను రూపొందించేందుకు ఆర్‌బీఐ ఫ్రేమ్‌వ‌ర్క్‌ను రూపొందించింది. దేశీయంగా శ‌క్తిమంత‌మంగా ఉండే జాబితాను రూపొందించేందుకు క‌స‌ర‌త్తును మొత్తం ఆర్బీఐయే చేస్తుంది. వ్య‌వ‌స్థ‌కు ఎంతో ముఖ్య‌మైన ఈ బ్యాంకుల పేర్ల‌ను ఆర్‌బీయే ప్ర‌క‌టిస్తుంది.

4) అద‌న‌పు నిధులు

4) అద‌న‌పు నిధులు

బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు, రిస్క్ ఉన్న ఆస్తులు, బ్యాంకుల వార్షిక ప‌నితీరు వంటి వాటిని ఆర్బీఐ స‌మీక్షిస్తుంది. అయితే ఒక‌సారి జాబితాలో చోటు ద‌క్కిన బ్యాంకు అద‌నపు నిధుల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.

5) విదేశీ బ్యాంకుల విష‌యంలో

5) విదేశీ బ్యాంకుల విష‌యంలో

ఒక‌వేళ విదేశీ బ్యాంకు మ‌న దేశంలో వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ అంత‌ర్జాతీయంగా ముఖ్యమైన బ్యాంకుల్లో ఉంటే అంత‌ర్జాతీయంగా రూపొందించిన ముఖ్య‌మైన బ్యాంకులకు రూపొందించి క్యాపిట‌ల్ ఈక్విటీ టైర్‌-1 నిధుల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. రిస్క్ ఉన్న నిష్ప‌త్తిలోనే ఆయా బ్యాంకులు నిధుల‌ను క‌లిగి ఉండాల‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌ట‌న తెలుపుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+