వాయిస్, డేటాతో కూడా రూ.429 రీచార్జ్ ప్లాన్‌ను మంగళవారం ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
జియో నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తనదైన ఆఫర్‌ను ప్రకటించింది. వాయిస్, డేటాతో కూడా రూ.429 రీచార్జ్ ప్లాన్‌ను మంగళవారం ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

రోజూ 1జీబీ డేటా 90 రోజుల పాటు
ఈ ప్లాన్ కింద 90 రోజుల పాటు తన ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసు కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత లోకల్/ఎస్‌టీడీ కాల్స్‌ను చేసుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్లు దాదాపుగా 84 రోజుల ఉచిత ఆఫర్లు ఇస్తుండగా దాన్ని బీఎస్ఎన్ఎల్ 90 రోజులు చేసింది.

కేరళ మినహా ఇండియా మొత్తం
కేరళ మినహా మిగతా ప్యాన్-ఇండియా బేసిస్‌లో ఈ 90 రోజుల ప్లాన్‌ను లాంచ్‌చేస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. 90 రోజుల వరకు వాలిడిటీలో ఉండే ఈ ప్యాక్‌లో నెలవారీ ఖర్చు 143 రూపాయలు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అత్యంత పోటీనిచ్చే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు బోర్డ్ డైరెక్టర్ మిట్టల్ చెప్పారు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల మార్పు
కేవలం ఒక ప్లాన్ ప్రవేశపెట్టడమే కాకుండా దాదాపుగా డేటా సంబంధిత ప్లాన్లన్నింటినీ బీఎస్ఎన్ఎల్ సవరించింది. అంతే కాకుండా అధిక డేటాను అందించడానికి వీలుగా 5 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సైతం మార్చింది. ఇదంతా జియోతో ఉన్న పోటీని తట్టుకునేందుకే అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జియోతో పోటీకే అపరిమిత ఉచిత కాల్స్
ప్రభుత్వ టెలికాం సంస్థ ఇటీవలే ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 666 ప్లాన్‌ను మార్కెట్లోకి వదిలింది .ఇప్పుడు కొత్తగా ప్రకటించిన అపరిమిత ఉచిత కాల్స్, ఉచిత డేటా ప్లాన్లు జియో అన్‌లిమిటెడ్‌తో పోటీ పడటంతో పాటు కస్టమర్లకు విలువకు తగ్గ రీచార్జీలను అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్ సైతం జియోతో పోటీపడేందుకు వీలుగా రూ.399 ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications