ఏటీఎమ్‌ల్లో రూ.200 నోట్ల రాక కోసం మరో 3 నెలలు
ఆర్‌బీఐ కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన రూ.200 నోటు ఏటీఎమ్ యంత్రాల నుంచి వచ్చేలా ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 3 నెలలు పట్టేలా కనిపిస్తోంది. కొత్త తరహా నోట్లు వచ్చేలా ఏటీఎమ్‌ల్లో సాంకేతిక మార
ఆర్‌బీఐ కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన రూ.200 నోటు ఏటీఎమ్ యంత్రాల నుంచి వచ్చేలా ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 3 నెలలు పట్టేలా కనిపిస్తోంది. కొత్త తరహా నోట్లు వచ్చేలా ఏటీఎమ్‌ల్లో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం. కొన్ని బ్యాంకుల వద్ద రూ.200 నోట్ల కరెన్సీ లేకపోయినప్పటికీ ఏటీఎమ్ కంపెనీలను తమ ఏటీఎమ్‌లను సైతం కొత్త నోట్ల విడుదలకు తగ్గట్లుగా పరీక్షలు చేయాల్సిందిగా కోరాయి. గతేడాది నవంబరు నెలలో పెద్ద నోట్ల మార్పడి(రద్దు) పెద్దఎత్తున జరగడంతో అప్పట్లో వాటికి అవసరమైన ఏటీఎమ్ మార్పులను చేపట్టారు.

ఆర్బీఐ త్వరలోనే రూ.200 నోటు సరఫరాను వేగవంతం చేస్తామని చెప్పినప్పటికీ ఎంత కాలంలో అనే సంగతిని వెల్లడించలేదు. అయితే ఏటీఎమ్ తయారీ కంపెనీలు మాత్రం తమకైతే ఆర్బీఐ నుంచి ఏటీఎమ్ మార్పులకు సంబంధించి ఏ విధమైన సమాచారం రాలేదని చెబుతున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అనధికారికంగా కొత్త నోట్ల విడుదలకు వీలుగా ఏటీఎమ్ సాంకేతిక మార్పులు చేపట్టాల్సిందిగా కోరాయని ఏటీఎమ్ కంపెనీలు అంటున్నాయి. అయితే దేశంలో ఉన్న మొత్తం 2.25 లక్షల ఏటీఎమ్‌లను కొత్త రూ.50 నోట్లకు అనుగుణంగా మర్చుతారో లేదో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications