ఎందుకంటే నమోదు కాని రెస్టారెంట్లు, హోటళ్లకు జీఎస్టీ ఉండదని కేంద్రం తెలిపింది. పుణెకు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ జగదీష్ లాడే తను తిని బిల్లు చెల్లించే రెస్టారెంట్లో ఈ విషయాన్ని గమనించాడు.
రెస్టారెంట్‌కు వెళ్లారు. తినడం అయిపోయి వెళ్లిపోయేటప్పుడు బిల్ తీసుకున్నారు. చడీ చప్పుడు లేకుండా ఎంత ఉందో అంతా చెల్లించేసి వెళ్లిపోయారు. అందులో ఈ మధ్య జీఎస్టీ సైతం ఉంటోంది. అయితే అన్నింటికీ ఇది సబబు కాదు. ఎందుకంటే నమోదు కాని రెస్టారెంట్లు, హోటళ్లకు జీఎస్టీ ఉండదని కేంద్రం తెలిపింది. పుణెకు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ జగదీష్ లాడే తను తిని బిల్లు చెల్లించే రెస్టారెంట్లో ఈ విషయాన్ని గమనించాడు. బిల్లు తాను తిన్న ఆహారానికి చార్జీతోపాటు జీఎస్టీ విధించడం జరిగింది. పైన బిల్లులో చూస్తే ఆ రెస్టారెంట్‌కు రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.

1.నమోదు కాని రెస్టారెంట్
రెస్టారెంట్ నమోదు కాకుండా, జీఎస్టీఐఎన్ నంబర్ లేకుండా తన బిల్లులో జీఎస్టీ విధించడంపై జగదీష్‌కు అనుమానం కలిగింది. వెంటనే రెస్టారెంట్ యజమానితో తాను బిల్లుకు సంబంధించి జీఎస్టీ మాత్రం చెల్లించను అని చెప్పాడు. అంతే కాకుండా నమోదు కాని రెస్టారెంట్ వినియోగదారుల నుంచి జీఎస్టీ తీసుకోవడాన్ని తప్పు పట్టి, అలా చేస్తే ఎదురయ్యే పర్యవసానాలను వివరించాడు.

2. జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబరు లేకుండానే
అయితే రెస్టారెంట్ యజమాని తాను రెగ్యులర్‌గా కలిసే చార్టెడ్ అకౌంటెట్‌కు ఫోన్ చేశాడు. ఏదో మాట్లాడుకున్నాడు. తర్వాత తమకు ఇంకా జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబరు రావాల్సి ఉందని చెప్పాడు. అయితే జగదీష్ గట్టిగా పట్టుబడేసరికి తన దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన జీఎస్టీ డబ్బులు వెనక్కి ఇచ్చాడు.

3. ఫేస్‌బుక్ పోస్టింగ్
ఈ సమాచారాన్ని లాడే ఆగస్టు18న తన ఫేస్‌బుక్ వాల్ మీద ఈ పోస్ట్ పెట్టాడు. ఈ కథనం ప్లాన్ చేసేటప్పటికి దానికి 95వేల షేర్లు, 25 వేల లైక్‌లు వచ్చాయి. తనకు నిబంధనలన్నీ పక్కాగా తెలుసు అని నిర్దారించుకున్న రెస్టారెంట్ యాజమాన్యం తన బిల్లు మీద విధించిన జీఎస్టీని వెనక్కి తిరిగి ఇచ్చారని బూమ్ ఇంటర్వ్యూలో జగదీష్ లాడే చెప్పారు. బూమ్ లాడేతో మాట్లాడిన తర్వాత ఆ నిబంధనలను సరిచూసింది. అది నిజమే అని తేలింది.

4. జీఎస్టీ నిబంధనలు
అయితే జగదీష్ లాడే చార్టెర్డ్ అకౌంటెంట్ అందులోనూ సొంత సంస్థ నిర్వహిస్తున్నాడు కాబట్టి సరిపోయింది. అదే మామూలు పౌరులైతే ఇదంతా జరిగి ఉండేది కాదేమో! జీఎస్టీ నిబంధనలు ఏ తరహా రెస్టారెంట్లో ఎంత జీఎస్టీ అమలవుతుందో అందరికి తెలియడం అంత సులువు కాదు. మరి ఈ తరుణంలో తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో లాడే ఇచ్చిన మరింత ఉపయోగకర సమాచారాన్ని తెలుసుకుందాం.

5. జీఎస్టీకి సంబంధించి ఉపయోగపడే సమాచారం
1. ఒక సంస్థ,షాప్, యజమాని రిజిస్టర్డ్ లేదా అన్ రిజిస్టర్డ్ అని ఎలా తెలుస్తుంది?
ఏ రిజిస్టర్డ్ వ్యాపారం అయినా బిల్లులో జీఎస్టీ నంబరు ప్రింట్ చేయాలి
2. ప్రింటెడ్ జీఎస్టీ నంబరును ఎలా వెరిఫై చేయాలి?
జీఎస్టీ నంబరును ఈ లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
https://services.gst.gov.in/services/searchtp
3. రెస్టారెంట్ల విషయంలో అమలయ్యే జీఎస్టీ రేట్లు
నాన్ ఏసీ లేదా ఆల్కహాల్ అనుమతి లేని హోటళ్లు 12% జీఎస్టీ విధించేందుకు అనుమతి
అదే ఏసీ హోటళ్ల, ఆల్కహాల్ అనుమతించే హోటళ్ల విషయంలో 18% జీఎస్టీ
రూ.75 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉండి, అంతే కాకుండా కాంపోజిషన్ పథకం కింద ఆప్షన్ ఎంచుకున్న రెస్టారెంట్ల విషయంలో జీఎస్టీ 5% మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
4. జీఎస్టీ విషయంలో మోసం జరిగినట్లు భావిస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
ఈమెయిల్ : [email protected]
ఫోన్ నంబరు: 0120-488899, 011-23370115
ట్విట్టర్: @askGST_Goi , @FinMinIndia
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications