ఆసియాలోనే అత్యంత అవినీతిమయ దేశంగా భారత్ నిలిచింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భారతదేశాన్ని అవినీతి లేని దేశంగా మారుస్తామని ప్రధానమంత్రి మోడీ చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన ఉండటం లేదు. ఆసియాలోనే అత్యంత అవినీతిమయ దేశంగా భారత్ నిలవడమే దీనికి కారణం. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతి 10 మందిలో 7గురు లంచాలిచ్చారు
69 శాతం అవినీతితో భారత్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానంలో ఉన్న వియత్నాంలో 65 శాతం, థాయిలాండ్లో 41 శాతం, పాకిస్తాన్‌లో 40 శాతం అవినీతి ఉన్నట్లు సర్వేలో తేలింది. 0.2% శాతంతో జపాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. భారత్‌లో ప్రతి పది మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు సమర్పించుకున్న వారే.

16 ఆసియా దేశాల్లో
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పౌర సమాజ సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వివిధ దేశాల్లో చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. జర్మనీకి చెందిన ఈ సంస్థ సుమారు 18 నెలల పాటు 16 ఆసియా దేశాల్లో సర్వేను నిర్వహించింది. ఈ సర్వే నివేదికను ఫోర్బ్స్ పత్రిక కూడా ప్రకటించింది.

అవినీతి తిష్ట వేసిన 5 ప్రజా విభాగాలు
భారతదేశంలో విద్య, ఆరోగ్యం, పోలీస్, వినియోగ సేవలు, ఐడీ డాక్యుమెంట్లు... ఇలా ప్రతీ విభాగంలోనూ అవినీతి తిష్ట వేసిందని నివేదిక తెలిపింది. భారత్‌లో లంచాల బెడద ఎక్కువగా ఉందని ఈ సర్వేలో పాల్గొన్నవారంతా తెలిపారు. ఏదో ఒక సందర్భంలో తాము కూడా లంచాలు చెల్లించినట్లు అంగీకరించారు.

లంచాల బెడద ఎక్కువ ఇక్కడే..
మిగిలిన అన్ని దేశాల కంటే భారత్‌లో ప్రభుత్వ పాఠశాలలు(58%), ఆసుపత్రులు(59%) విభాగాల్లో లంచాల బెడద ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ విభాగాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా లంచాలు చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. అది ఇదీ అని లేకుండా దేశంలో ప్రతి విభాగంలోనూ అవినీతి తిష్ట వేసినట్లు పేర్కొంది.

ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు
అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందని సంస్థ తెలిపింది. ఈ జర్మనీ సంస్థ గతేడాది సమర్పించిన నివేదికలో భారత్‌లో ఎక్కువ అవినీతి ఉన్నట్లు నివేదించింది. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఎత్తిచూపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications