వైజాగ్‌లో జిరాక్స్ కంపెనీ కేంద్రం
జిరాక్స్ కంపెనీ విశాఖప్నటంలో సొంత క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తగినంత భూమి కేటాయిస్తే 5,000 మందికి ఉపాధి కల్పించేలా క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
జిరాక్స్ కంపెనీ విశాఖప్నటంలో సొంత క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తగినంత భూమి కేటాయిస్తే 5,000 మందికి ఉపాధి కల్పించేలా క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. దీన్లో ఐటీ-బీపీఓ ఉద్యోగాలు తలా 50 శాతం ఉంటాయని చెప్పారు. విశాఖపట్నం నుంచి జిరాక్స్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు.

సొంత భూమి కేటాయించే వరకూ మధురవాడలో నిర్మిస్తున్న మిలీనియం టవర్‌లో కార్యకలాపాలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. భూమి కేటాయించినా క్యాంపస్ నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది కనక తక్షణం 500 మందికి ఉపాధి కల్పించే విధంగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ నెలాఖరుకల్లా ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications