3 వారాల గరిష్టానికి సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ 3 వారాల గరిష్ట స్ఠాయికి వెళ్లింది. ప్రభుత్వం ప్రకటించిన వృద్ది రేటు బలహీనంగా ఉండటంతో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న నమ్మకాన్ని కలిగించడంతో మార్కెట్లు సాన
బీఎస్ఈ సెన్సెక్స్ 3 వారాల గరిష్ట స్ఠాయికి వెళ్లింది. ప్రభుత్వం ప్రకటించిన వృద్ది రేటు బలహీనంగా ఉండటంతో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న నమ్మకాన్ని కలిగించడంతో మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 31,892 వద్ద ముగియగా, మరో సూచీ నిఫట్ఈ 56.5 పాయింట్ల లాభంతో 9974 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.59%), ఆటో(1.94%), లోహ రంగం(1.86%), హెల్త్‌కేర్(1.84%) లాభపడగా, మరో వైపు కన్సూమర్ డ్యూరబుల్స్(0.27%), ఐటీ(0.17%), టెక్నాలజీ(0.1%0 నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(9.75%), బజాజ్ ఆటో(3.94%), ఏసియన్ పెయింట్స్(3.73%), టాటా మోటార్స్(2.9%), కొటక్ బ్యాంక్(2.05%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో టీసీఎస్(1.4%), భారతీ ఎయిర్‌టెల్(1.37%), హెచ్‌డీఎఫ్‌సీ(1.32%), పవర్ గ్రిడ్(0.82%), విప్రో(0.54%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications