భవిష్యత్తులో జీఎస్టీ శ్లాబులు తగ్గే అవకాశం
ఎకనమిస్ట్ అనే మ్యాగజైన్ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి జైట్లీ పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ అమలు జరిపే కొద్దీ వచ్చే ప్రయోజనాల వల్ల కొన్ని రోజుల తర్వాత పన్ను రేట
సమీప భవిష్యత్తులో జీఎస్టీలో ఉన్న శ్లాబులు తగ్గే అవకాశమున్నట్లు అరుణ్ జైట్లీ సూచనలిచ్చారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీకి సంబంధించి బుధవారం, గురువారం జైట్లీ మాట్లాడారు. ఎకనమిస్ట్ అనే మ్యాగజైన్ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి జైట్లీ పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ అమలు జరిపే కొద్దీ వచ్చే ప్రయోజనాల వల్ల కొన్ని రోజుల తర్వాత పన్ను రేట్లను ఎక్కువ లేకుండా కేవలం 12%, 18% ఉండేలా చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి సైతం జీఎస్టీ సంబంధిత రాజ్యాంగబద్దమైన జీఎస్టీ కౌన్సిల్ తగు సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అన్నారు.

"దేశంలో వినియోగదారులు వివిధ రకాల ఆదాయం వర్గాల వారీగా ఉన్నందున మన దేశంలో జీఎస్టీ పన్ను ఏకరీతిన విధించడం సాధ్యం కాదు. అందుకే జీఎస్టీ కౌన్సిల్ 4 రకాల పన్ను రేట్లను నిర్ణయించింది. వివిధ వ్యక్తుల ఆదాయం వేర్వేరుగా ఉన్నందున రోజువారీ వాడే వస్తువులు, విలాసవంతమైన కార్లు లాంటి వాటికి ఒకే రకమైన పన్ను విధించడం సాధ్యపడదు." అని జైట్లీ ఈ సందర్భంగా వివరించారు. జీఎస్టీ పన్ను విధానం కారణంగా ప్రభుత్వ ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేసే ఖర్చు పెరగగలదని జైట్లీ అభిప్రాపపడ్డారు. జులై నెలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి మించి జీఎస్టీ వసూళ్లు సాధించాయని ఆయన వెల్లడించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications