ఆర్బీఐ వార్షిక నివేదికలో నోట్ల రద్దు తర్వాత వెనక్కు వచ్చిన నోట్లెన్ని, వెనక్కు వచ్చిన వాటిలో అసలు కరెన్సీ ఎంత అనే విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే రూ.500, రూ.1000 నోట్లు రద్దు
నవంబరు 8,2016 అర్దరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను మార్పిడి(రద్దు) చేసే నిర్ణయం ఎన్‌డీఏ ప్రభుత్వానికి చరిత్రాత్మకమైనది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ చాలా రోజుల పాటు ఫలితాలను ప్రకటించలేదు. అయితే బుధవారం ఆర్బీఐ వార్షిక నివేదికలో నోట్ల రద్దు తర్వాత వెనక్కు వచ్చిన నోట్లెన్ని, వెనక్కు వచ్చిన వాటిలో అసలు కరెన్సీ ఎంత అనే విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన తర్వాత వాటి మొత్తం కరెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు కేంద్రం రద్దు చేసిన వాటి విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా అందులో 15.28 లక్షల కోట్ల విలువ చేసే పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. జూన్ 30 వరకూ గల వివరాలను ఆర్‌బీఐ నివేదికలో పొందుపరిచింది. బ్యాంకులకు వెనక్కు రాని కరెన్సి విలువలో రూ.16 వేల కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విలువ లెక్కింపులో నేపాల్ సంబంధించిన కరెన్సీ నోట్ల విలువ, జిల్లా సహకార బ్యాంకుల్లో జమ అయిన నోట్ల వివరాలు లేవు.
వెనక్కు రాని నోట్లకు సంబంధించి రూ.1000 నోట్ల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ రూ.500 నోట్ల గురించి సుస్పష్టమైన ప్రకటన లేదు. రూ.1000 నోట్లలో దాదాపు 99.5% పాత నోట్లు వెనక్కు రాగా, రూ.8925 కోట్ల విలువ చేసే రూ.1000 నోట్లు మాత్రమే వెనక్కు రాలేదని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక దేశ కరెన్సీ మొత్తం వివరాలను చూద్దాం. నవంబరు 8,2016 నాటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ 17.77 లక్షల కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆగస్టు 4,2017 నాటికి అది రూ.14.75 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదిక చాటింది. పెద్ద నోట్లను వ్యవస్థ నుంచి తప్పించడం వల్లే ఈ విధంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం బలవంతంగా కరెన్సీని కట్టడి చేయడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం వంటివి కూడా దీనికి కారణాలుగా నిలిచి ఉండొచ్చు.
పలు లెక్కలు: సులువుగా అర్థం కావడానికి
నవంబరు నాటికి ఉన్న డబ్బు: 15.44 లక్షల కోట్లు(రూ.500, రూ.1000 నోట్లు)
పెద్ద నోట్లలో ప్రభుత్వానికి వెనక్కు వచ్చింది ఎంత: 15.28 లక్షల కోట్లు
వెనక్కు రాని రూ.1000 నోట్లు: 6.7 బిలియన్ వేయి నోట్లలో 89 మిలియన్
జూన్ నాటికి తగ్గిన కరెన్సీ నోట్ల శాతం: 11.79%
2016-17లో గుర్తించిన దొంగ నోట్లు: 7,62,072
కరెన్సీ నోట్ల ముద్రణకు అయిన ఖర్చు: రూ.7965 కోట్లు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications