రిలయన్స్ 4జీ తర్వాత జనాల్లో 4జీ వాడకం పెరిగింది. అయితే అది ఇంకా దేశవ్యాప్తంగా పూర్తిగా విస్తరించనేలేదు. ఆ లోపే 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
రిలయన్స్ 4జీ తర్వాత జనాల్లో 4జీ వాడకం పెరిగింది. అయితే అది ఇంకా దేశవ్యాప్తంగా పూర్తిగా విస్తరించనేలేదు. ఆ లోపే 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐదో తరం సేవలు అందించేందుకు అవసరమయ్యే స్పెక్ట్రంను విక్రయించడానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్దమైంది. గతేడాది విక్రయించిన 600 మెగామెర్ట్జ్ రేడియో తరంగాలకు మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈసారి సరైన ప్రణాళికతో ట్రాయ్ సంప్రదింపులను ప్రారంభించింది. టెలికాం శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాయ్ వేలాన్ని నిర్వహించనుంది. తొమ్మిది రకాల బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రంను విక్రయించేందుకు ప్లాన్ వేశారు. స్పెక్ట్రం విలువ, రిజర్వు ధరపై కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నారు. గతంలో నిర్వహించిన వేలంలో అమ్ముడుపోని 60 శాతం తరంగాలను కలుపుకొని ఈసారి కొత్తగా 5జీ సేవలు అందించగలిగే స్పెక్ట్రాన్ని సైతం వేలం వేయనున్నట్లు ట్రాయ్ విడుదల చేసిన పత్రం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం సంవత్సరంలోనే తరంగాలను వేలం వేయాలని టెలికాం శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ట్రాయ్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. దీంట్లో భాగంగానే సోమవారం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.

ఇప్పుడు తదుపరి వేలంలో వివిధ బాండ్లలో దాదాపు 1671.15 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం అమ్మకానికి రానుంది. 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్, 3300-3400మెగాహెర్ట్జ్, 3400-3600మెగాహెర్ట్జ్ బాండ్లలో రేడియో తరంగాలు మొదటిసారి వేలానికి రానున్నాయి. మొత్తం పౌన:పున్యాలు(రేడియో తరంగాల్లో) అక్టోబర్ 2016 వేలంలో అమ్ముడుపోని 60% రేడియో తరంగాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications