అంచనాలు మించిన జీఎస్టీ వసూళ్లు
జులై నెలలో జీఎస్టీ వసూళ్లు దేశవ్యాప్తంగా అంచనాలను మించాయి. రూ.92,283 కోట్ల మేర జీఎస్టీ పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటిదాకా 39 లోల మంది నుంచి జీఎస్టీ
జులై నెలలో జీఎస్టీ వసూళ్లు దేశవ్యాప్తంగా అంచనాలను మించాయి. రూ.92,283 కోట్ల మేర జీఎస్టీ పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటిదాకా 39 లోల మంది నుంచి జీఎస్టీ పన్ను రసీదులు అందుకున్నట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం మొదటి నెల జులైలో రూ.91వేల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా దాన్ని దాటేసింది. మొత్తం నమోదిత పన్ను 59.57లక్షల చెల్లింపుదార్లలో పన్ను కట్టిన వారి సంఖ్య 64.4%గా ఉందని జైట్లీ అన్నారు. మొత్తం జీఎస్టీ వసూళ్లలో కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) ద్వారా రూ.14,894 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.22,722 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) ద్వారా రూ.47,469 కోట్లు ఉన్నాయి. ఐజీఎస్టీ అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరఫరా అయ్యే వస్తు,సేవల మీద విధించే జీఎస్టీ.

వార్షిక బడ్జెట్‌లో పన్ను లక్ష్యాల గురించి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పన్ను లక్ష్యం రూ.48వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం రూ.43వేల కోట్లుగా చెప్పారు. మొత్తంగా జీఎస్టీ ద్వారా జులై నెలకు పన్ను వసూళ్ల లక్ష్యం రూ.91 వేల కోట్లుగా ఉంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకున్నాయో లేదో తెలియదని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ లక్ష్యాలకు తగ్గ విధంగా పన్ను వసూళ్లను చేరుకోలేకపోతే జీఎస్టీ ద్వారా వసూలయిన రూ.7198 కోట్ల నుంచి వాటికి పరిహారాన్ని చెల్లిస్తామని కేంద్రం తరపున అరుణ్ జైట్లీ చెప్పారు.


Click it and Unblock the Notifications