For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్ల‌పై జీఎస్టీ సుంకం పెంపు

మ‌ధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీల‌కు సంబంధించిన సెస్సును పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయా కార్ల‌పై సెస్సు 15 శాతం దాకా ఉంది. దీన్ని 25 శాతం వ‌ర‌కూ పెంచేందుకు రంగం సిద్

|

మ‌ధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీల‌కు సంబంధించిన సెస్సును పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయా కార్ల‌పై సెస్సు 15 శాతం దాకా ఉంది. దీన్ని 25 శాతం వ‌ర‌కూ పెంచేందుకు రంగం సిద్ద‌మైంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు కొన్ని వ‌ర్గాలు తెలిపాయి. ఎస్‌యూవీలు, మ‌ధ్య స్థాయి, పెద్ద కార్ల‌కు సంబంధించి జీఎస్టీ సుంకాన్ని పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆగ‌స్టు 5న ఆమోదం తెలిపింది. అయితే జీఎస్టీ చ‌ట్టం,2017 లో సెక్ష‌న్‌8ని స‌వ‌రిస్తేనే ఈ సుంకం పెంపుకు వీల‌వుతుంది.

కార్ల‌పై విధించే ప‌న్ను రేట్ల పెంపు

జీఎస్టీ అమ‌ల్లోకి రాక‌ముందు మోటారు వాహ‌నాల‌పై ప‌న్ను 52-54.72 శాతానికి అద‌నంగా సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్‌, ఆక్ట్రాయ్ రూపంలో మ‌రో 2.5% ప‌న్ను అద‌నంగా విధించేవారు. జీఎస్టీ అమ‌లు త‌ర్వాత మొత్తం విధించే ప‌న్ను 43 శాతం వ‌ర‌కూ ఉంది. అయితే జీఎస్టీ అమ‌లుకు ముందు కార్ల‌పై ఎంత‌యితే ప‌న్నుందో ఆ స్థాయికి వెళ్లేందుకు సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాల్సి ఉంది. జీఎస్టీ వ‌ల్ల క‌లిగిన ప్ర‌యోజ‌నంతో చాలా ఎస్‌యూవీలు రూ.1.1 నుంచి 3 ల‌క్ష‌ల మ‌ధ్య రేట్ల‌ను తగ్గించాయి. ఇప్పుడు మ‌ళ్లీ సెస్ ప్ర‌భావంతో కార్ల ధ‌ర‌లు సాధార‌ణ స్థితికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more about: gst cars
English summary

కార్ల‌పై జీఎస్టీ సుంకం పెంపు | Cabinet clears Ordinance to hike gst cess on cars

The Cabinet today cleared promulgation of an Ordinance to increase the cess on mid-size, large cars and SUVs from current 15 per cent under the new GST regime. The proposal before the Cabinet was to hike the cess rate on these cars to 25 per cent.
Story first published: Wednesday, August 30, 2017, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X