వోడాఫోన్-హచిసన్ : రూ.32 వేల కోట్ల జరిమానా
ఈ పన్ను వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తామని హచిసన్ గ్రూప్ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం పన్ను వివాదానికి సంబంధించి వోడాఫోన్ నుంచి బకాయిలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. హచిసన్
హాంకాంగ్ దేశానికి చెందిన హచిసన్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.32 వేల కోట్ల పన్ను కట్టాల్సిందిగా ఆదేశించింది. దశాబ్దం కిందటి వోడాఫోన్-హచిసన్ విలీనం కేసుకు సంబంధించి ఈ ఏడాది ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ మరోసారి పన్ను వివాదాన్ని మళ్లీ బయటకు తీసింది. అప్పట్లో మామూలుగా ఆదాయపు పన్ను శాఖ విధించిన పన్ను రూ.7900 కోట్లు కాగా, అదీ కోర్టులో కేసు సాగతీయగా మరోసారి దానిపై వడ్డీ రూ. 16,430 కోట్ల వరకూ అయింది. దానితో పాటు మరో రూ.7900 కోట్లను పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా వాస్తవరూపం దాలిస్తే వోడాఫోన్ ఐటీ శాఖకు రూ.32 వేల కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వస్తుంది.

ఈ పన్ను వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తామని హచిసన్ గ్రూప్ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం పన్ను వివాదానికి సంబంధించి వోడాఫోన్ నుంచి బకాయిలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. హచిసన్‌కు చేసిన చెల్లింపులకు సంబంధించి వోడాఫోన్ నుంచి ప్రభుత్వం రూ.7990 కోట్లను పన్నుగా కట్టాలని కోరింది. అదే పన్ను బకాయి వడ్డీతో కలుపుకుంటే రూ.20 వేల కోట్లు అయింది. తమపై విధించిన పన్నుకు సంబంధించి జనవరి 2012 నుంచి సుప్రీంకోర్టులో వోడాఫోన్ పోరాడుతోంది. హచిసన్ గ్రూప్‌కు సంబంధించి ఇండియాలో జరిగిన లావాదేవీకి సంబంధించి తాము ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదని వోడాఫోన్ వాదిస్తోంది. 2007 సంవత్సరంలో సీకే హచిసన్ చెందిన హచిసన్‌కు చెందిన మొబైల్-ఫోన్ వ్యాపారంలో 67 శాతం వాటాను వొడాఫోన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత నుంచి భారత ప్రభుత్వం, ఐటీ శాఖ పన్ను వివాదానికి సంబంధించి వోడాఫోన్‌ను వివరణ అడుగుతూనే ఉన్నాయి. ఇది కోర్టు కేసులను కొనసాగిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications