360 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
డిసెంబరు 2016 తర్వాత మార్కెట్లు ఈ రోజు మళ్లీ ఈ స్థాయిలో నష్టపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అంతే కాకుండా ఈ వారం ఆగస్ట్ సిరీస్ డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు పెద్ద ఎత్తున నష
నాలుగు వరుస సెషన్ల లాభాల తర్వాత మంగళవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. రెండు సూచీలు 1 శాతం పైగా కోల్పోయాయి. డిసెంబరు 2016 తర్వాత మార్కెట్లు ఈ రోజు మళ్లీ ఈ స్థాయిలో నష్టపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అంతే కాకుండా ఈ వారం ఆగస్ట్ సిరీస్ డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 362.43 పాయింట్లు నష్టపోయి 31,388.39 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 116.75 పాయింట్లు కోల్పోయి 9800 వద్ద స్థిరపడింది.

ఎక్కువగా నష్టపోయినవి
362 పాయింట్లు కోలపోయిన సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు నష్టాలనే మిగిల్చింది. నిఫ్టీలో ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్‌సీ, ఐషర్ మోటార్స్, యెస్ బ్యాంకు ఎక్కువగా నష్టపోయాయి. ఎన్టీపీసీలో ప్రభుత్వ వాటా అమ్మకం ప్రకటనతో ఈ కంపెనీ షేర్ బాగా పతనం అయింది. సెన్సెక్స్లో ఎన్టీపీసీ(2.8%), సన్ ఫార్మా(2.35%), హెచ్డీఎఫ్‌సీ(2.2%), రిలయన్స్(2.17%), కోల్ ఇండియా(2.1%) నష్టపోయాయి.

అంతర్జాతీయంగా
అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే జపాన్ సముద్ర ప్రాంతంలో ఉత్తర కొరియా జరిపిన క్షిపణి పరీక్ష కారణంగా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో కొనసాగాయి. యూరోపియన్ సూచీలు ఆరు నెలల్లోనే అత్యంత కనిష్టానికి వెళ్లి 1% నష్టపోయాయి. జపాన్ నిక్కీ ఇంట్రాడేలో నాలుగు నెలల కనిష్టానికి వెళ్లాయి.

రూపాయిపై ప్రభావం
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలతో పలు కరెన్సీలు మాత్రం హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. డాలరుతో పోలిస్తే యూరో లాభపడింది. హాంగ్‌సెంగ్, జపాన్ నిక్కి స్వల్పంగా నష్టపోయాయి. రూపాయి 10 పైసలు నష్టపోయి 64.01 వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలు
అంతర్జాతీయంగా కీలక పరిణామాలు ఏవి సంభవించినా బంగారం రేట్లలో మార్పు వస్తుంది. దాదాపు దేశంలోని చాలా నగరాల్లో బంగారం ధరలు రూ.450 వరకూ పెరిగాయి. ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.29,300గా పలుకుతోంది. స్పాట్ బంగారం సైతం పెరిగి ఔన్స్ 1322 డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications