For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 1000 నోటుపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ప్ర‌భుత్వం

రద్దు చేసిన రూ.1000 నోటును కూడా మళ్లీ చలామణిలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్‌ నాటికి వాటిని విడుదల చేసే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఆర్థికశాఖ స్

|

నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఎప్పుడు క‌రెన్సీ గురించి ఏ వార్త వ‌స్తుందో, ఏది నిజ‌మో కాదో తెలియ‌కుండా పోతోంది. అయితే రూ.100, రూ.500 నుంచి రూ.2000 మ‌ధ్య చిల్లర కష్టాలను తీర్చేందుకు ఇటీవల రూ.200 నోటును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దు చేసిన రూ.1000 నోటును కూడా మళ్లీ చలామణిలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్‌ నాటికి వాటిని విడుదల చేసే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఆర్థికశాఖ స్పష్టత ఇచ్చింది. రూ.వెయ్యి నోటును మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ తెలిపారు.

 రూ. 1000 నోటుపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ప్ర‌భుత్వం

నల్లధనాన్ని క‌ట్ట‌డి చేసేందుకు గతేడాది నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్‌ 8న ప్ర‌క‌టించారు. పాత రూ.500 ,రూ.1000 నోట్లను బ్యాంకుల్లో జమచేసేందుకు ఆ ఏడాది డిసెంబర్‌ 31 వరకూ అనుమతినిచ్చారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్లను విడుదల చేశారు. అయితే వీటితో చిల్లర కష్టాలు మొదలవడంతో రూ.200 నోటును చ‌లామ‌ణీలోకి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో రూ.వెయ్యి నోటును కూడా మళ్లీ తీసుకొస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కొత్త టెక్నాలజీ, భద్రతాపరమైన ఫీచర్లతో ఈ నోటును ఆర్‌బీఐ తీసుకురానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ఊహాగానాలపై ఆర్థికశాఖ స్పష్టత ఇచ్చింది.

Read more about: currency rbi
English summary

రూ. 1000 నోటుపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ప్ర‌భుత్వం | rs 1000 notes not coming govt given clarity

Economic affairs secretary Subhash Chandra Garg says there is no proposal for reintroduction of Rs1000 notes, days after RBI launched new Rs 200 notes and Rs 50 notes
Story first published: Tuesday, August 29, 2017, 22:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X