155 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
మార్కెట్ వర్గాల్లో ఇన్ఫోసిస్ కంపెనీపై నెలకొన్న సానుకూలతతో మార్కెట్లు ఆశావహంగా కొనసాగాయి. వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 154.76 పాయింట్ల లాభంతో 31,750 వద్ద ము
మార్కెట్ వర్గాల్లో ఇన్ఫోసిస్ కంపెనీపై నెలకొన్న సానుకూలతతో మార్కెట్లు ఆశావహంగా కొనసాగాయి. వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 154.76 పాయింట్ల లాభంతో 31,750 వద్ద ముగియగా; నిఫ్టీ 55.75 పాయింట్ల లాభంతో 9912 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే వినియోగదారు వస్తువులు(1.29%), ఐటీ రంగం(1.25%), మౌలిక రంగం(1.24%), టెక్నాలజీ(1.14%) లాభపడ్డాయి.

సెన్సెక్స్‌లో లాభపడిన కంపెనీలను చూస్తే ఇన్ఫోసిస్(3.14%), ఎన్టీపీసీ(2.1%), సన్‌ఫార్మా(1.96%), హీరో మోటోకార్ప్(1.93%), హెచ్‌యూఎల్(1.87%) ఉన్నాయి. మరో వైపు నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.01%), టాటా మోటార్స్(1.25%), పవర్ గ్రిడ్(1.00%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.41%), టీసీఎస్(0.38%0 ఉన్నాయి.


Click it and Unblock the Notifications