రూ.6 పెరిగిన లీటరు పెట్రోలు ధర
పెట్రోలు ధరల రోజువారీ మార్పును ప్రవేశపెట్టినప్పటి(జులై) నుంచి ఇప్పటిదాకా పెట్రోలు లీటరుకు రూ.6 మేర పెరగింది. దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర రూ.3.67 పెరిగి రూ.57.03గా ఉండగా ఇది నాలుగు నెలల్
పెట్రోలు ధరల రోజువారీ మార్పును ప్రవేశపెట్టినప్పటి(జులై) నుంచి ఇప్పటిదాకా పెట్రోలు లీటరుకు రూ.6 మేర పెరగింది. దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర రూ.3.67 పెరిగి రూ.57.03గా ఉండగా ఇది నాలుగు నెలల్లోనే గరిష్టం అని చమురు, సహజ వాయు సంస్థల ద్వారా తెలుస్తున్నది. మరో వైపు ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.69.04గా ఉండగా ఇది ఆగస్టు 2014 తర్వాత అత్యధికం అన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆగస్టు నెల రెండో అర్ధ భాగంలో పెట్రోలు ధర రూ.70.33గా పలికింది. ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు ప్రతి నెలా ధరల మార్పు విధానాన్ని ప్రవేశపెట్టి, ఆ తర్వాత జూన్ 16 నుంచి రోజువారీ ఇంధన ధరల మార్పు విధానాన్ని తీసుకొచ్చారు.

రోజువారీ ధరల మార్పును తీసుకొచ్చిన తర్వాత జూన్ 16 వ తేదీ పెట్రోలు ధర రూ.65.48 కు పెరగ్గా, తర్వాత జులై 2 రోజున 63.06కు తగ్గింది. ఇలా అన్ని రోజులను చూస్తే కేవలం 4 సార్లు తప్ప మిగిలిన రోజులన్నీ ఇంధన ధరలు పైకే వెళ్లాయి. తగ్గినప్పుడు మాత్రం 2 నుంచి 9 పైసల మేర తగ్గాయి. అదే విధంగా డీజిల్ విషయానికి వస్తే జూన్ 16న 54.49 వద్ద ఉన్న ధర జులై 2 నాటికి రూ. 53.36కు వచ్చింది. అప్పటి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న ధరలు సామాన్యుడికి సంతోషాన్నేం మిగల్చలేదు. ఇంతకు ముందు ఒకేసారి రూ.2 లేదా రూ.3 వరకూ పెరిగేది ఇప్పుడు ఆ భారం కనబడటం లేదు. ఒక్కోసారి 1పైసా నుంచి 15 పైసల వరకూ ధరల మార్పు ఉంటోంది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంతర్జాతీయంగా జరిగే ధరల మార్పు తక్షణమే వినియోగదారులపైకి బదలాయిస్తారు. ఈ విధంగా కొత్త విధానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు రూ. 6 మేర పెట్రోలు ధర పెరిగింది.


Click it and Unblock the Notifications