టాప్ 10 అమ్మకాల్లో మారుతి సుజుకివే ఏడు
ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో మారుతి సుజుకి తన హవాను నిలబెట్టుకుంది. జులై నెలలో జరిపిన అమ్మకాల్లో టాప్-10 బ్రాండ్లలో మారుతి సుజుకికి చెందినవే ఏడు ఉన్నాయి. మారుతి ఆల్టో ప్రథమ స్థానంలో ఉంది.
ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో మారుతి సుజుకి తన హవాను నిలబెట్టుకుంది. జులై నెలలో జరిపిన అమ్మకాల్లో టాప్-10 బ్రాండ్లలో మారుతి సుజుకికి చెందినవే ఏడు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) వెల్లడించిన సమాచారం ఆధారంగా టాప్10 అమ్మకాలు జరిపిన కార్లలో మారుతి ఆల్టో ప్రథమ స్థానంలో ఉంది. మారుతి ఆల్టో అమ్మకాలు గతేడాది జులై నెలలో 19,844 యూనిట్లుగా ఉండగా ఈ ఏడాది జులై నెలలో 26,009 యూనిట్లుగా ఉన్నాయి.
మారుతి బాలెనో అమ్మకాలు రెండో స్థానంలో, గతేడాది 9120 యూనిట్ల నుంచి ఈ ఏడాది 19,153 యూనిట్లకు పెరిగాయి.
కాంపాక్ట్ కార్ వాగాన్ ఆర్ 16,301 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది. గతేడాది జులై నెలలో వాగాన్ ఆర్ అమ్మకాలు 15,207గా ఉండటం గమనార్హం.

వితారా బ్రిజా 15,423 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అదే గతేడాది ఈ మోడల్ కార్ల అమ్మకాలు 10,232 యూనిట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి.
మారుతి సుజుకి ఇండియాకు చెందిన స్విఫ్ట్ అమ్మకాలు 13,738 యూనిట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇదే స్విఫ్ట్ అమ్మకాలు 2016 జులై నెలలో 13,934గా ఉన్నాయి.
మారుతి సుజుకి ప్రధాన పోటీదారు హుందాయ్ గ్రాండ్ ఐ10 అమ్మకాలు 12,002 యూనిట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. అదే ఈ ఐ10 అమ్మకాలు గతేడాది జులైలో 11,961గా ఉన్నాయి.
హుందాయ్ ప్రీమియం ఎలైట్ ఐ20 అమ్మకాలు 11,390 యూనిట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి.
మారుతి సుజుకి సెడాన్ డిజైర్ అమ్మకాలు ఈ ఏడాది జులైలో 11,087 సంఖ్యతో ఎనిమిదో స్థానంలో, సెలెరియా అమ్మకాలు 11,087 యూనిట్లతో తొమ్మిదో స్థానాలను ఆక్రమించుకున్నాయి.
హుందాయ్ ఎస్‌యూవీ క్రెటా అమ్మకాలు 10,556 యూనిట్లతో పదో స్థానంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications