ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోకి గట్టి పోట్టి ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇదివరకే ప్రకటించిన జియో ఫోన్, త్వరలో ఎయిర్టెల్ పోటీ గురించి, మరిన్ని ఆసక్త
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ త్వరలో 4జి ఫీచర్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించే యోచనలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,500లకే వినియోగదా రులకు అందించనుందని తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియోకి గట్టి పోట్టి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇదివరకే ప్రకటించిన జియో ఫోన్, త్వరలో ఎయిర్టెల్ పోటీ గురించి, మరిన్ని ఆసక్తికర విశ్లేషణ గురించి తెలుసుకుందాం.

1. దీపావళికి వచ్చే ఫోన్ ధర రూ.2500
పలు మొబైల్ ఫోన్ల తయారీదారులతో ఎయిర్‌టెల్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.2500 వరకూ ఉండే అవకాశం ఉంది. ఇందులో కొన్ని వందల ఉచిత నిమిషాలతో పాటు ముందే నిర్ణయించిన ఉచిత డేటాను అందిస్తారు. దీపావళి సమయానికి ఈ ఫోన్ వచ్చే అవకాశమున్నట్లు టెలికాం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది రిలయన్స్ జియోతో పోటీ పడేందుకు ఎయిర్‌టెల్‌కు ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

2. పలు ఫోన్ల తయారీదారులతో చర్చలు
ఈ 4జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకోచ్చేందుకు ఇప్పటికే లావా, కార్బన్ లాంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో ఎయిర్‌టెల్ జరిపిన చర్చలు తుది దశలో ఉన్నట్టుగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్స్ టైమ్ ఒక కథనంలో తెలిపింది. ఈ ఫోన్ వినియోగదారులకు అందించేందుకు ప్రత్యేక సబ్సిడీ ఉండకపోవచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు.

3. ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్
"రూ.2500కు అటుఇటుగా ధర ఉండేలా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయాలనేది ఎయిర్‌టెల్ ప్రణాళికగా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్, రిలయన్స్ జియో ఆఫర్ చేసిన ఫీచర్ ఫోన్ కంటే మెరుగ్గా, పెద్ద స్క్రీన్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండేలా రూపొందించాలని అనుకుంటున్నారు." అని ఎయిర్‌టెల్ ప్లాన్స్‌కు సంబంధించిన ఒక అధికారి తెలిపారు. ఈ చర్చలు తుది దశలో ఉన్నట్లు సదరు వ్యక్తి వెల్లడించారు.

4. టెలికాం కంపెనీలు ఫోన్లు విడుదల చేసే పనిలో
సెప్టెంబరు నుంచి రిలయన్స్ జియో ఉచిత 4జీ ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్లు ప్రకటించింది. దీనికి రూ.1500 డిపాజిట్ చేయాలని ప్రచారం జరుగుతోంది. అలాగే ఐడియా, తన కంపెనీ ద్వారా చాలా తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని వెల్లడించింది. ఇదే కోవలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా చౌక ధరకే స్మార్ట్ ఫోన్‌ను అందించనున్నట్లు ప్రకటించడం దేశ టెలికాం రంగంలో ఒక రకమైన అలజడిని సృష్టిస్తుందేమో చూడాలి.

5. జియో రాకతో కొత్త కస్టమర్లు చేరుతున్నారా?
5. జియో రాకతో కొత్త కస్టమర్లు చేరుతున్నారా?
దేశ టెలికాం పరిశ్రకమకు చెందిన సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) గత వారంలో జులై నెలకు సంబంధించి టెలికాం చందాదారు(సబ్‌స్క్రైబర్స్)ల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో 94.97 కోట్ల టెలికాం వినియోగదారులున్నారు. ఇందులో 28.12 కోట్లతో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉండగా, వోడాఫోన్(21 కోట్లు), ఐడియా(19కోట్లు) ద్వితీయ,తృతీయ స్థానాల్లో ఉన్నాయి. మరో వైపు 12.3 కోట్లతో జియో 7వ స్థానంలో వచ్చింది. వచ్చిన ఏడాది కాలంలో దాదాపు 13% వాటా చేజిక్కుంచుకుంది. ఇక జులై నెలలో కొత్తగా జత చేరిన చందాదారుల విషయానికొస్తే వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్‌టెల్కు కొత్తగా 6,02,771 జత చేరగా, వోడాఫోన్ నుంచి 13.89 లక్షల మంది, ఐడియా నుంచి 23.20 లక్షల మంది చేజారారు. ఇదంతా జియో ప్రభావమేనని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications