276 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఊపందుకున్న కొనుగోళ్ల‌తో దేశీయ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దాదాపు సూచీలు రెండూ 1% మేర లాభ‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాలు మన మార్కెట్లు బాగా రాణించే

స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఊపందుకున్న కొనుగోళ్ల‌తో దేశీయ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దాదాపు సూచీలు రెండూ 1% మేర లాభ‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాలు మన మార్కెట్లు బాగా లాభాలు గ‌డించేందుకు దోహ‌ద ప‌డ్డాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 276 పాయింట్ల లాభంతో 31,568 వ‌ద్ద ముగియ‌గా; మ‌రో సూచీ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 9852.5 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(0.04%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.75%) న‌ష్ట‌పోగా మిగిలిన కీల‌క రంగాలు లాభాల బాట ప‌ట్టాయి. స్థిరాస్తి(3.48%), లోహ రంగం(1.81%), బ్యాంకింగ్(1.39%), పీఎస్‌యూ(1.2%) లాభాల బాట‌లో సాగిన వాటిలో ఉన్నాయి.

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

స్థిరాస్తి రంగంలో డీఎల్ఎఫ్ దాదాపు 8% లాభాల‌ను స్వీక‌రించింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఏకీకృతానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఒక విధానాన్ని రూపొందించేందుకు సిద్ద‌మ‌వ‌డంతో బ్యాంకింగ్ రంగ షేర్లు లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో అదానీ పోర్ట్స్‌(2.79%), భార‌తీ ఎయిర్‌టెల్(2.41%), టాటా స్టీల్(2.28%), డాక్ట‌ర్ రెడ్డీస్‌(2.25%), ఇన్ఫోసిస్(1.98%) ముందుండ‌గా; మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో హెచ్‌యూఎల్(1.05%), స‌న్ ఫార్మా(0.45%), ఐటీసీ(0.28%), ప‌వ‌ర్ గ్రిడ్‌(0.21%), ఎం అండ్ ఎం(0.13%) ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+