సెప్టెంబరులో రూ. 200 నోటును తీసుకురానున్న ఆర్‌బీఐ
ఆర్‌బీఐ రూ.200 నోటును ఎవరూ అక్రమంగా దాచుకోకుండా ఉండేందుకు సమాలోచనలు చేస్తూ సెప్టెంబరు ఆరంభానికి దాన్ని ప్రవేశపెట్టే పనిలో ప్రణాళికలో ఉంది. ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించి
దేశ చరిత్రలోనే మొదటిసారి రూ. 200 నోటును తీసుకువస్తున్న ఆర్‌బీఐ రూ.200 నోటును ఎవరూ అక్రమంగా దాచుకోకుండా ఉండేందుకు సమాలోచనలు చేస్తూ సెప్టెంబరు ఆరంభానికి దాన్ని ప్రవేశపెట్టే పనిలో ప్రణాళికలో ఉంది. ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించిన దాని ప్రకారం ఆగస్టు చివరలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఆర్బీఐ రూ.200 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

రూ.200 నోటు వచ్చిన తర్వాత కొంత మందే దాన్ని పట్టి ఉంచుకోకుండా అన్ని చర్యలు తీసుకొని అదే విధంగా కొత్త రూ.50 కరెన్సీని సైతం విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. భారతదేశంలో రూ.100 నోటు తర్వాత మళ్లీ రూ.500 వరకూ ఎలాంటి మధ్య విలువ నోట్లు లేవన్న సంగతి అందరికీ విదితమే. తద్వారా కొత్త కరెన్సీని రూ.200 నోటు రూపంలో రిజర్వ్ బ్యాంక్ చలామణీలోకి తీసుకొచ్చి నోట్ల మార్పిడికి చెక్ పెట్టేందుకు పనికొస్తుందని ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక వేత్త సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. రూ.2000 నోటు మొదటిసారి వ్యవస్థలోకి తీసుకొచ్చిన సమయంలో బ్లాక్ మార్కెటింగ్(కొంత మందే దాన్ని పట్టి ఉంచినట్లు) జరిపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అదే రకమైన తప్పులు జరక్కుండా చూడాలని ఆర్‌బీఐ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications