అన్నీ డిజిటల్ లావాదేవీలు ఒకే చోట
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారత్ క్యూఆర్, యూపీఐ, ఎస్ఎంఎస్ పే, బ్యాంకింగ్ మొబైల్ వాలెట్ అన్నింటినీ ఒకే చోట జరిపేందుకు వీలుగా కొత్త పీఓఎస్ యంత్రాన్ని ప్రవేశ
ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలో చాలా వాటిని కస్టమర్లకు తెలియకుండా బ్యాంకులు ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టాయి. ఒక బ్యాంకుకు సంబంధించి ఎన్ని డిజటల్ చెల్లింపుల వ్యవస్థలు ఉన్నాయో వినియోగదారులకు సరిగా తెలియదు. అయితే ఈ గందరగోళానికి తెరదించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భారత్ క్యూఆర్, యూపీఐ, ఎస్ఎంఎస్ పే, బ్యాంకింగ్ మొబైల్ వాలెట్ అన్నింటినీ ఒకే చోట జరిపేందుకు వీలుగా కొత్త పీఓఎస్ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఇదివరకే బ్యాంకుకు ఉన్న 4 లక్షల పీఓఎస్ యంత్రాల్లో సైతం ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు బ్యాంకు ప్రణాళికలు వేసుకుంది.

యూపీఐను ఆగస్ట్ 2016లోనూ, భారత్ క్యూఆర్ వ్యవస్థను జనవరి 2017లోనూ ప్రవేశపెట్టినప్పటికీ జనాల్లో చొచ్చుకుపోవడంలో ఇవి వెనుకబడ్డాయి. డిజి పీవోఎస్ విధానం ప్రారంభిస్తూ బ్యాంకు కార్డు చెల్లింపుల అధిపతి పరాగ్ రావు మాట్లాడుతూ "తమ బ్యాంకు చెల్లింపుల విధానాన్ని ఉపయోగిస్తున్న వ్యాపారులు ఆధునిక చెల్లింపుల్లో కాస్త వెనుకబడి ఉన్నారు. వివిధ రకాల యంత్రాలు ఉన్నాయి. ఎవరో ఒకరు వచ్చి వ్యాపారులకు యాప్ డౌన్‌లోడ్‌ల గురించి చెప్పే దాకా వారు దాని గురించి ఆలోచించడం లేదు" అని చెప్పారు. కొత్త వాటిని వాడటంలో కొంత మంది తడబాటుకు గురవుతున్నారని అన్నారు.
పీవోఎస్: పాయింట్ ఆఫ్ సేల్ (మనం షాపింగ్ చేసినప్పుడు కార్డు గోకే యంత్రం)
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications