For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం దిగుమ‌తుల‌పై 3% జీఎస్టీ చెల్లించ‌నున్న బ్యాంకులు

బ్యాంకులు తాము దిగుమ‌తి చేసుకునే బంగారంపై 3శాతం జీఎస్టీ చెల్లించి, త‌ర్వాత దాన్ని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో క్లెయిం చేసుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

|

బ్యాంకులు తాము దిగుమ‌తి చేసుకునే బంగారంపై 3శాతం జీఎస్టీ చెల్లించి, త‌ర్వాత దాన్ని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో క్లెయిం చేసుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. బంగారం ర‌త్నాభ‌ర‌ణాలు వంటి వాటిపై వ్యాపారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీబీఈసీ స‌మాధాన‌మిస్తూ బ్యాంకులు ఇదివ‌ర‌క‌టికైతే ఎటువంటి వ్యాట్ చెల్లించేవి కావ‌నీ కేవ‌లం క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించేవ‌ని వివ‌రించింది.అయితే ఇక‌పై జీఎస్టీ చెల్లించాల‌ని వెల్ల‌డించారు. "జీఎస్టీ అమ‌లు ప్రారంభం అయిన త‌ర్వాత 3శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని అన్ని విలువైన లోహాల‌పై చెల్లించాలి. దీనికి అద‌నంగా క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించాలి."

బంగారం

ఎటువంటి ఖ‌రీదైన‌ లోహాలు, ఆభ‌ర‌ణాలు దిగుమ‌తి చేసుకున్నా వాటిని స‌ర‌ఫ‌రా చేసే వారు కాదు భారాన్ని వ‌హించాల్సింది. దాన్ని ఎవ‌రైతే దేశంలోకి ర‌ప్పించుకుంటున్నారో వారే ఐజీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంద‌ని సీబీఈసీ చెప్పింది. "దిగుమ‌తుల‌కు సంబంధించి సొంత దారు ఎవ‌ర‌న్న‌ది ముఖ్యం కాదు. న‌మోదిత సంస్థ‌ల‌యిన బ్యాంకులు, తాము తెప్పించుకున్న బంగారంపై ప‌న్ను చెల్లించవ‌ల‌సి ఉంటుంది." అని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంలో సీబీఈసీ వివ‌రించింది.

బంగారం దిగుమ‌తులు 10% క‌స్ట‌మ్స్ డ్యూటీకి అర్హ‌త సాధిస్తాయి. జీఎస్టీ రాక మునుపు దానికి అద‌నంగా 12.5% కౌంట‌ర్‌వెయిలిగ్ డ్యూటీ(సీవీడీ) ఉండేది. జీఎస్టీ వ‌చ్చిన త‌ర్వాత సీవీడీని తీసేశారు క‌నుక జీఎస్టీ రేటు 3% బంగారంపై వర్తిస్తుంది.

Read more about: gold
English summary

బంగారం దిగుమ‌తుల‌పై 3% జీఎస్టీ చెల్లించ‌నున్న బ్యాంకులు | Banks to pay 3percent gst on Gold Imports

However, under GST, "3 per cent Integrated-GST is payable on all imports of precious metals in addition to the basic customs duty. IGST (Integrated GST) paid can be taken as input tax credit by the banks."
Story first published: Wednesday, August 23, 2017, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X