For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌మ్మె: బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌పై తీవ్ర ప్ర‌భావం

కార్పొరేట్‌ సంస్థల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎలు)ను రద్దు చేయటం, వివిధ సేవలపై బ్యాంకు ఛార్జీలను విపరీతంగా పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ ఆందోళనకు దిగుతున్నారు. వీటికి తోడు ప్రభుత్వ రంగంలోన

|

దేశ‌వ్యాప్తంగా ప‌లు బ్యాంకులు మంగ‌ళ‌వారం మూత ప‌డనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును కాపాడేందుకు, వాటిని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తుల పరం చేసేందుకు సాగుతున్న యత్నాలను తిప్పికొట్టేందుకు దేశవాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎలు)ను రద్దు చేయటం, వివిధ సేవలపై బ్యాంకు ఛార్జీలను విపరీతంగా పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ ఆందోళనకు దిగుతున్నారు. వీటికి తోడు ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రయివేటీ కరించేందుకు ఉద్దేశించిన 'బ్యాంకు సంస్కరణల'ను తిప్పికొట్టాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) పిలుపునిచ్చింది. ఈ స‌మ్మెలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్‌(యూఎఫ్‌బీయూ) కింద ఉన్న 9 యూనియ‌న్లు క్రియాశీల‌కంగా ఉంటున్నాయి. ఇందులో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస‌ర్స్ క‌న్ఫ‌డ‌రేష‌న్‌(ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేష‌న్‌(ఏఈబీఈఏ), నేష‌న‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ వ‌ర్క‌ర్స్ వంటివి ఉన్నాయి.
దేశంలో రోజువారీ మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో 21 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల చేతిల్లో 75% కార్య‌క‌లాపాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో స‌మ్మె ప్ర‌భావం జ‌నాల‌పై ఉండ‌కుండా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇండియ‌న్ బ్యాంక్స్ అసోషియేష‌న్ కోరింది.
ఈ నేప‌థ్యంలో స‌మ్మె ప్ర‌భావం ఉండే 5 అంశాల గురించి తెలుసుకుందాం.

 బ్యాంకు ఉద్యోగ‌లు దేశ‌వ్యాప్త స‌మ్మె

1) చెక్కు క్లియ‌రెన్సులు, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ లావాదేవీలు ఇంకా బ్యాంకు శాఖ‌ల్లో జ‌రిగే డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్ మీద ప్ర‌భావం ఉంటుంది. అయితే ఐఎంపీఎస్ లావాదేవీల‌పై ఎటువంటి ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని బ్యాంకు అధికారి ఒక‌రు తెలిపారు.
2) ప్రైవేటు బ్యాంకుల‌యిన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ మొద‌లైన వాటిలో కార్య‌క‌లాపాలు సాధార‌ణంగానే కొన‌సాగుతాయి. చెక్కు క్లియ‌రెన్సుల్లో జాప్యం జ‌ర‌గొచ్చు.
3) కార్పొరేట్ రుణాల‌కు సంబంధించి రుణాల‌ను పూర్తిగా ర‌ద్దు చేయ‌డం(రైట్ ఆఫ్‌) చేయ‌కూడ‌ద‌ని, అంతే కాకుండా ఉద్దేశపూర్వ‌కంగా రుణాల ఎగ‌వేత‌కు పాల్ప‌డ‌టాన్ని క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణించాల‌ని కోరుతున్నారు. స‌మ్మెలో పాల్గొంటున్న ఉద్యోగుల ప్ర‌ధాన డిమాండ్ల‌లో ఇది ఒక‌టి.
4) ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు సంబంధించి ముఖ్య కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టే డేటా సెంట‌ర్లు తెరిచే ఉంటాయ‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
5) నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఉద్యోగులు చేసిన ఎక్కువ ప‌నికి ఓవ‌ర్ టైమ్ ఇవ్వాల‌ని ఒక యూనియ‌న్ నాయ‌కుడు కోరారు. అంతే కాకుండా కార్పొరేట్ నిర‌ర్ద‌క ఆస్తుల(వ‌సూలు కాని రుణాల‌) భారాన్ని సామాన్యుల‌పైకి నెట్ట‌కూడ‌ద‌ని సూచించారు. అంటే రుసుములు పెంచ‌డం ద్వారా వినియోగ‌దారులంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులు వ‌సూలు చేయ‌డాన్ని సంఘాలు వ్య‌తిరేకిస్తున్నాయి.

Read more about: banks banking strike
English summary

స‌మ్మె: బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌పై తీవ్ర ప్ర‌భావం | Banking operations to be hit today due to national wide strike

Bank employee unions have called a one-day, nation-wide strike to protest against the government's proposed consolidation move, besides raising other demands. The strike has been called by unions under the aegis of the United Forum of Bank Unions (UFBU), an umbrella body of nine unions, including All India Bank Officers' Confederation (AIBOC), All India Bank Employees Association (AIBEA) and National Organisation of Bank Workers (NOBW).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X