ఎయిర్ ఏసియా ''7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్'' పేరు మీద ఈ వినూత్న ప్రచార పథకాన్ని ప్రకటించింది.ఎంపికచేసిన వన్-వే విమానాలకు టిక్కెట్‌ను రూ.999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ టిక్కెట్ ధరలోనే అ
7 రోజుల పాటు అబ్బురపరిచే ఆఫర్లను ఎయిర్ ఏసియా ప్రకటించింది. ఎంపికచేసిన వన్-వే విమానాలకు టిక్కెట్‌ను రూ.999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ టిక్కెట్ ధరలోనే అన్ని ఛార్జీలు కలిపి ఉంటాయి. ''7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్'' పేరు మీద ఈ వినూత్న ప్రచార పథకాన్ని ప్రకటించింది. దీని కింద విమాన ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని ఎయిర్‌ఏసియా తన వెబ్‌సైట్లో చెప్పింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీ కోసం...

1. ముఖ్య విషయాలు
ఎప్పటి ప్రయాణాలకు ఆఫర్ : ఫిబ్రవరి 26,2018 నుంచి ఆగస్ట్ 28,2018 మధ్య
బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి: ఆగస్టు 27, 2017 లోపు
బుకింగ్ ఎక్కడ: వెబ్‌సైట్, ఎయిర్ ఏసియా మొబైల్ యాప్‌లలో చేసుకునే బుకింగ్‌లపై

2. ఆఫర్ వివరాలు
2018 ఫిబ్రవరి 26 నుంచి 2018 ఆగస్టు 28 మధ్య చేసే ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుంది. ఇది పరిమిత కాలపు ఆఫర్. బుకింగ్‌లు కేవలం వెబ్సైట్లోనూ, కంపెనీ మొబైల్ యాప్‌ల్లోనూ జరగాలి. అయితే ఎన్ని సీట్లకు ఆఫర్ వర్తిస్తుందో కంపెనీ వెబ్‌సైట్ స్పష్టంగా ఇవ్వలేదు.

3. రూ.1099 టిక్కెట్
హైదరాబాద్-బెంగుళూరు, కొచ్చి-బెంగుళూరు, గౌహతి-ఇంఫాల్, గోవా-బెంగుళూరు, భువనేశ్వర్-కోల్‌కత రూట్లలో ఆఫర్ వర్తించే దాని ప్రకారం టిక్కెట్ల ధరలు రూ.1099 నుంచి మొదలవుతాయి. పుణె-బెంగుళూరు, విశాఖపట్నం-బెంగుళూరు రూట్లలో టిక్కెట్ల ధరలు రూ.1499(పన్నులతో సహా)

4. అంతర్జాతీయంగా
మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా, టాటా సన్స్ సంయుక్తంగా నెలకొల్పిందే ఎయిర్ ఏసియా. ప్రమోషనల్ సేల్‌లో భాగంగా అంతర్జాతీయ రూట్లలో సైతం తక్కువ రేట్లకు టిక్కెట్లను అందిస్తున్నారు.
కొచ్చి(కేరళ), తిరుచిరాపల్లి(తమిళనాడు) నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ల ధరలు రూ3399 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి ఫిబ్రవరి 26,2018 నుంచి ఆగస్ట్ 28,2018 మధ్య కాలానికి ఆగస్టు 27 లోపు బుక్ చేసుకునే టిక్కెట్లకే ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తిస్తుంది. అదే విధంగా విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ నగరానికి టిక్కెట్ల ధరలు రూ.3599 నుంచి మొదలవుతున్నాయి.
telugu.goodreturns.in


Click it and Unblock the Notifications