యాక్సిస్ గృహ రుణాల్లో 12 ఈఎంఐలు కట్టక్కర్లేదు
దీర్ఘకాల గృహ రుణంలో 4,8,12 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 4 ఈఎంఐలను మాఫీ చేస్తారు. అంటే ఆయా ఏడాది సమయాల్లో నాలుగు ఈఎంఐలను గృహ రుణ దారు కట్టక్కర్లేదు.
హోం లోన్ మార్కెట్లో ఎక్కువ వాటాను చేజిక్కించుకునేందుకు యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. శుభ్ ఆరంభ్ పేరుతో కొత్త గృహ రుణ పథకాన్ని మొదలుపెట్టింది. ఈ కొత్త పథకం ప్రకారం దీర్ఘకాల గృహ రుణంలో 4,8,12 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 4 ఈఎంఐలను మాఫీ చేస్తారు. అంటే ఆయా ఏడాది సమయాల్లో నాలుగు ఈఎంఐలను గృహ రుణ దారు కట్టక్కర్లేదు. యాక్సిస్ బ్యాంకు ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి ముఖ్య అంశాలను కింద తెలుసుకోండి

1. శుభ్ ఆరంభ్ కింద గృహ రుణాలను ఇంటి నిర్మాణానికి, కొత్త ఇంటి కొనుగోలుకు, ప్లాట్ తీసుకుని ఇల్లు కట్టకునేందుకు, నిర్మాణంలో ఉన్న ఇంటికి వంటి వాటికి తీసుకోవచ్చు.
2. వినియోగదారు 20 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే, మొత్తం 12 వాయిదాలను మాఫీ చేస్తారు. అంటే మొత్తం రూ.30 లక్షల రుణంలో రూ.3.09 లక్షలు ఆదా అవుతుంది.
3. ఈ వాయిదాలను మాఫీ చేసే సౌకర్యం రూ.30 లక్షలు లేదా అంతకు లోపు రుణాలకు వర్తింపజేస్తారని యాక్సిస్ బ్యాంకు తెలిపింది.
4. అయితే ప్రతి వాయిదాను క్రమం తప్పకుండా చెల్లించేవారికే ఇది వర్తిస్తుంది.
5. మొదటిసారి గృహ రుణం తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే తీసుకున్న వారి విషయంలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు గృహ రుణం మార్చుకునే వారిని ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బ్యాంకు వివరించింది.
6. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అర్హత సాధించిన వారు దాన్ని సైతం ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications