For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాల‌పై ప్రాసెసింగ్ రుసుముల‌ను తొల‌గించిన ఎస్బీఐ

క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, ద్విచ‌క్ర వాహ‌నాలు, కార్లు కొనేందుకు తీసుకునే రుణాల‌పై ఉండే ప్రాసెసింగ్ రుసుముల‌ను పూర్తిగా తొల‌గించింది.

|

పండుగ‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎస్‌బీఐ రుణ గ్ర‌హీత‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. వినియోగ‌దారు వ‌స్తువులు(క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌), ద్విచ‌క్ర వాహ‌నాలు, కార్లు కొనేందుకు తీసుకునే రుణాల‌పై ఉండే ప్రాసెసింగ్ రుసుముల‌ను పూర్తిగా తొల‌గించింది. రుణాల్లోని ర‌కాల్లో కార్ల రుణాలు, వ్య‌క్తిగ‌త రుణాలు, వ్య‌క్తిగ‌త బంగారు రుణం వంటి వాటితో పాటు, ఎస్బీఐకి ఇత‌ర బ్యాంకుల నుంచి మార్చే గృహ రుణాల‌పై కూడా ఈ మార్పు వ‌ర్తిస్తుంద‌ని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐ ప్రాసెసింగ్ రుసుము

యాక్సిస్ బ్యాంకు శుభ్ ఆరంభ్ పేరుతో గృహ రుణం తీసుకునే వారికి ఈఎంఐల మాఫీ పేరిట ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో స్టేట్ బ్యాంక్ సైతం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆఫ‌ర్‌నిచ్చింది.
డిసెంబ‌రు 31,2017 లోపు తీసుకునే కార్ల రుణాల‌పై పూర్తిగా ప్రాసెసింగ్ రుసుముల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది.
అదే విధంగా అక్టోబ‌ర్ 31 లోపు తీసుకునే వ్య‌క్తిగ‌త బంగారు రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం వ‌ర‌కూ ర‌ద్దు చేశారు. ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద తీసుకునే తక్ష‌ణ రుణాల విష‌యంలో సెప్టెంబ‌రు 30 లోపు తీసుకునే వాటికి ప్రాసెసింగ్ రుసుమును 50 శాతం వ‌ర‌కూ త‌గ్గింపు ఆఫ‌ర్ను ఎస్‌బీఐ అందుబాటులో ఉంచింది.

Read more about: sbi processing fee loans banking
English summary

రుణాల‌పై ప్రాసెసింగ్ రుసుముల‌ను తొల‌గించిన ఎస్బీఐ | sbi Waived Processing Fees Of Different Loans

In a press release, SBI said on car loans, the bank has extended complete waiver on processing fees until December 31, 2017. For personal gold loans, the waiver on processing fees is upto 50% and until October 31, 2017.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X