ఈనెల 28, 29 తేదీల్లో దిల్లీలో నారెడ్కో 14వ జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రేరా చట్టం నోటిఫై అయిందని.. 15 రోజుల్లో అథారిటీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించే వీలుందని
ఆగస్టు 28 నుంచి ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థిరాస్తి అభివృద్ది మండలి సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ "వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి (నియంత్రణ అండ్ అభివృద్ధి) చట్టం 2016 వంటి పరిణామాలు స్థిరాస్తి రంగానికి కొత్త వూపును ఇవ్వనున్నా"యని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నారెడ్కో) దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షుడు ఆర్. చలపతిరావు తెలిపారు.

జీఎస్‌టీ అమలు నేపథ్యంలో 12 శాతం పన్ను విధింపు, దానిపై వచ్చే ఇన్‌పుట్ క్రెడిట్‌పై స్పష్టత లభించిందని నారెడ్కో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షుడు జి.హరి బాబు, తెలంగాణ స్థిరాస్తి డెవలపర్ల సంఘం (ట్రెడా) అధ్యక్షుడు రవీంద్రరావు పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో దిల్లీలో నారెడ్కో 14వ జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రేరా చట్టం నోటిఫై అయిందని.. 15 రోజుల్లో అథారిటీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించే వీలుందని హరి బాబు చెప్పారు. లే అవుట్లు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అమరావతి పరిధిలో స్థిరాస్తి కార్యకలాపాలు పుంజుకునే వీలుందన్నారు. జాతీయ స్థాయి సమావేశం సందర్భంగా కొత్త స్థిరాస్తి ప్రాజెక్టులు, ఉత్పత్తులు, వివిధ వస్తువులు వంటివి ప్రదర్శనకు ఉంచనున్నారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications