ఇండియాబుల్స్ రికార్డు రాబడి: ప్రపంచంలోనే అత్యధిక లాభం
2008సంవత్సరంలో స్టాక్ ఎక్స్చేంజీలో చేరిన ఈ కంపెనీ 890 శాతం రాబడులతో ఈ సంవత్సరం రికార్డులను సృష్టించింది. 2012లో కేవలం రూ.5 వద్ద ఉన్న ఈ షేర్లు ప్రస్తుతం(ఆగస్ట్ 19,2017) రూ.201 దగ్గర ఉంది.
దేశ షేర్ మార్కెట్లో అరుదైన ఘనత రికార్డయింది. ఈ ఏడాది అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అత్యధిక శాతం లాభాలను అందించిన షేర్ల జాబితాలో ఇండియాబుల్స్ వెంచర్స్ చేరింది. నిజానికి బిలియన్ డాలర్ల పైన మార్కెట్ విలువ కలిగిన వాటిలో ఇండియాబుల్స్ వెంచర్స్ లిమిటెడ్ చాలా రోజుల పాటు చోటు దక్కించుకోలేదు. 2008సంవత్సరంలో స్టాక్ ఎక్స్చేంజీలో చేరిన ఈ కంపెనీ 890 శాతం రాబడులతో ఈ సంవత్సరం రికార్డులను సృష్టించింది. 2012లో కేవలం రూ.5 వద్ద ఉన్న ఈ షేర్లు ప్రస్తుతం(ఆగస్ట్ 19,2017) రూ.201 దగ్గర ఉంది.

3 నెలల్లో రెండు రెట్ల లాభం
న్యూఢిల్లీ కేంద్రంగా ఈ పనిచేస్తున్న ఈ కంపెనీలో పాతవారితో పాటు కొత్త వాటాదారులు బలమైన నమ్మకాన్ని ఉంచారు. ఇండియా బుల్స్ వెంచర్స్ లిమిటెడ్ అనేది సమీర్ గెహ్లాట్ ఆధ్వర్యంలోని ఇడియాబుల్స్ ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీలకు సంబంధించిన ఒక అనుబంధ సంస్థ. ఇండియా బుల్స్ వెంచర్స్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు జూన్‌తో ముగిసిన మూడు నెలలకు లాభాలు రెండింతలై రూ.503 కంపెనీ విలువ పెరిగింది. ఏడాదికి ముందున్న విలువతో పోలిస్తే ఇది రెండు రెట్లు.

ఈ ఏడాదిలో కదలిక ఇలా...
ఈ సంవత్సరం ప్రారంభంలో కేవలం రూ.21 దగ్గర ఉన్న ఈ షేర్ గత 7 నెలల కాలంలో ఏకంగా 890 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం బీఎస్ఈలో స్టాక్ విలువ రూ.201.30 గా ఉంది.


Click it and Unblock the Notifications